Begin typing your search above and press return to search.
స్పైడర్.. మనోభావాలు దెబ్బతిన్నాయ్
By: Tupaki Desk | 3 Oct 2017 3:30 AM GMTఎన్నో ఆశలతో.. ఇంకెన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన స్పైడర్ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా వల్ల మహేష్ బాబుకు కొత్తగా వచ్చిన గుర్తింపేం లేదు కానీ విలన్ గా నటించిన ఎస్.జె. సూర్యకు మాత్రం విపరీతమైన గుర్తింపు వచ్చేసింది.
స్పైడర్ డైరెక్టర్ మురుగదాస్ కూడా ఎస్.జె.సూర్య పాత్ర పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అతడి సైకోగా మారడానికి బాల్యంలో కారణమైన పరిస్థితులను సైతం సినిమాలో నెరేటివ్ గా చూపించారు. సినిమాలో ఈ సీన్లను కొత్త వివాదం చుట్టుముట్టింది. ఈ సీన్లు కాటికాపరులను కించపరిచేలా ఉన్నాయని... దీనివల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఓ వివాదం మొదలైంది. వెంటనే ఆ సీన్లు తీసేయాలంటూ సంబంధిత సంఘాల నాయకులు నిర్మాతను డిమాండు చేస్తున్నారు. లేకుంటే సినిమాను ఆడబోనీయమంటూ అడ్డుకుంటున్నారు.
అసలే స్పైడర్ వసూళ్లు తగిన స్థాయిలో లేక డల్లుగా నడుస్తోంది. ఇలాంటి టైంలో సినిమాలో కత్తెరేసుకుంటూ పోతే ప్రేక్షకులు కంటిన్యుటీ మిస్సయ్యామని ఫీలయ్యే ఆస్కారముంది. ఇంతకు ముందు వచ్చిన దువ్వాడ జగన్నాథమ్ తమ మనోభావాలు దెబ్బతీసిందంటూ బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడెలాగో సర్దిచెప్పి సినిమా విడుదల చేశారు. ఇప్పుడేమో అదే టైపు ఇబ్బంది స్పైడర్ ను చుట్టుముడుతోంది.