Begin typing your search above and press return to search.
వివాదంలో ‘కురప్’ మూవీ.. స్టేకు నిరాకరించిన కోర్టు
By: Tupaki Desk | 12 Nov 2021 11:30 AM GMTమలయాళ స్టార్ హీరో దుల్కన్ సల్మాన్ తాజాగా నటించిన చిత్రం ‘కురప్’. సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కురప్’ మూవీ పాన్ ఇండియా మూవీగా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ఆయనకు మూడో చిత్రం కావడం విశేషం. సస్పెన్స్ థిల్లర్ ప్రధానాంశంగా ‘కురప్’ మూవీని దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించారు.
వేఫేరర్ ఫిల్మ్స్.. ఎం స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లో ‘కురుప్’ మూవీ తెరకెక్కించింది. దాదాపు ఆరునెలలపాటు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దాదాపు 35 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించడం విశేషం. సుకుమార కురుప్ అనే నేరస్థుడి జీవిత కథను ఆధారంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కడంతో ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనా పెట్టుకున్నారు.
అయితే సినిమా విడుదలైన మొదటి రోజు ‘కురుప్’ మూవీ వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం. కేరళలోని కొచ్చికి చెందిన ఓ వ్యక్తి ‘కురుప్’ మూవీపై కోర్టులో పిల్ దాఖలు చేశారు. సుకుమార కురుప్ అనే నేరస్థుడి గోప్యతను వెల్లడించేలా ఈ మూవీని తెరకెక్కించాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనిపై కోర్టులో పిల్ సైతం దాఖలు చేశాడు.
కాగా ఈ పిల్ ను విచారించిన కేరళ హైకోర్టు ‘కురుప్’ మూవీపై స్టే విధించడానికి మాత్రం నిరాకరించింది. అయితే ఈ మూవీ నిర్మాతలకు మాత్రం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం మున్ముందు మరెన్ని వివాదాల్లో ఇరుక్కోబోతుందనే ఉత్కంఠత నెలకొంది.
మరోవైపు ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘కురుప్’ మూవీని దర్శకు శ్రీనాథ్ రాజేంద్రన్ ముంబై, దుబాయ్, మంగళూరు, మైసూర్, అహ్మదాబాద్ నగరాల్లో చిత్రీకరించారు. ఈ మూవీకి జితిన్ కె జోస్ కథను అందించగా.. డేనియల్ సయూజ్ నాయర్.. కెఎస్ అరవింద్ స్క్రీన్ ప్లేను అద్భుతంగా రాశారు.