Begin typing your search above and press return to search.

మ‌హాభార‌త పేరు మీద లొల్లి మొద‌లైంది

By:  Tupaki Desk   |   24 May 2017 7:51 AM GMT
మ‌హాభార‌త పేరు మీద లొల్లి మొద‌లైంది
X
దేశ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తొలిసారి వెయ్యి కోట్ల వ్య‌యంతో నిర్మించాల‌ని భావిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ది మ‌హాభార‌త సినిమాకు అడ్డంకులు మొద‌ల‌య్యాయి. ఈ మ‌ధ్య‌నే ప్ర‌క‌టించిన ఈ మూవీ తారాగ‌ణం ఎంపిక ఇంకా ఒక కొలిక్కి రాలేదు. షూటింగ్ ఎప్ప‌టి నుంచి స్టార్ట్ చేస్తార‌న్న దానిపై స్ప‌ష్ట‌త లేదు. కానీ.. ఈ సినిమా పేరును అర్జెంట్‌గా మార్చేయాల‌న్న అల్టిమేటం ఇచ్చారు కేర‌ళ‌కు చెందిన హిందూ ఐక్య‌వేదిక‌ సంఘం.

ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్ర‌హీత ఎం.టి. వాసుదేవ‌నాయ‌ర్ ర‌చించిన రాంద‌మూళం న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న నేప‌థ్యంలో.. ఆ సినిమాకు మ‌హాభార‌త అని పేరు ఎలా పెడ‌తార‌న్న‌ది ఈ సంఘం లేవ‌నెత్తిన సందేహం. రాంద‌మూళం న‌వ‌ల ఆధారంగా ఈ సినిమాను తీస్తున్న‌ప్పుడు ఆ సినిమాకు అదే పేరు పెట్టాలే కానీ.. వ్యాసుడు రాసిన మ‌హాభార‌తం పేరును ఎలా వాడుకుంటార‌ని సంఘం అధ్య‌క్షురాలు కె.పి. శ‌శిక‌ళ ప్ర‌శ్నిస్తున్నారు.

సినిమా పేరును కానీ మార్చ‌కుంటే.. చిత్ర విడుద‌ల‌ను అడ్డుకుంటామ‌ని ఆమె హెచ్చ‌రిస్తున్నారు. త‌మ మాట‌ల్ని ప‌ట్టించుకోకుండా అదే పేరుతో సినిమాను విడుద‌ల చేస్తే థియేట‌ర్ల‌లో ఆడ‌కుండా అడ్డుకుంటామంటున్నారు.
రాంద‌మూళం న‌వ‌ల పాండ‌వుల్లో రెండోవాడైన భీముడి గురించి ఉంటుంద‌ని.. అలాంట‌ప్పుడు ఈ సినిమాకు మ‌హాభార‌తం పేరును ఎలా వాడ‌తార‌న్న‌ది శ‌శిక‌ళ సందేహం.

యూఏఈకి చెందిన భార‌తీయ వ్యాపార‌వేత్త బీఆర్ శెట్టి ఈ మూవీని వెయ్యి కోట్ల‌తో నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీఏ శ్రీకుమార్ మేన‌న్ తీయ‌నున్న ఈ మూవీలో భీముడి పాత్ర‌లో మోహ‌న్ లాల్ కు ఓకే అనేశారు. టాలీవుడ్ మ‌న్మ‌థుడ్ని క‌ర్ణుడి పాత్ర‌ను పోషించాల‌ని కోర‌టం.. అన్ని పూర్తి అయ్యాక త‌న‌ను క‌ల‌వాల‌ని ఆయ‌న చెప్ప‌టం తెలిసిందే. పాత్ర‌ల ఎంపికే పూర్తి కాని ఈ సినిమాకు అప్పుడే వివాదాలు చుట్టుముట్ట‌టం చూస్తే.. ఈ సినిమా విడుద‌ల‌య్యే నాటికి మ‌రెన్ని త‌ల‌నొప్పులు తెర మీద‌కు వ‌స్తాయో?