Begin typing your search above and press return to search.
'తిమ్మరుసు' చిత్రంలోని 'తియ్యగుంది' డైలాగ్ పై వివాదం..!
By: Tupaki Desk | 2 Aug 2021 1:30 PM GMTకథ - టైటిల్ - పాత్రలు - సన్నివేశాలు - సంభాషణలు.. ఇలా సినిమాకు సంబంధించిన ప్రతీ అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వివాదాస్పదం చేయడం ఈ మధ్య ఎక్కువైంది. టాలీవుడ్ కూడా అందుకు మినహాయింపు కాదు. తాజాగా థియేటర్లలో విడుదలైన ''తిమ్మరుసు'' చిత్రం విషయంలో కూడా ఇప్పుడు ఓ వివాదం చెలరేగింది. ఇందులోని ఓ సీన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ని కావాలనే ట్రోల్ చేసినట్లుగా ఉందని పార్టీ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ - ప్రియాంక జావల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ''తిమ్మరుసు''. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు మరో నిర్మాత సృజన్ ఎరబోలు తో కలసి నిర్మించారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత జూలై 30న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్రహ్మాజీ ఓ సీన్ లో కొబ్బరి నీళ్ళు తాగి 'అబ్బా తియ్యగా ఉంది' అంటారు. ఇప్పుడు ఇదే వివాదాస్పద అవుతోంది.
గత ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన లోకేష్ ప్రచారం చేస్తున్నప్పుడు ఓ మహిళ ఇచ్చిన మజ్జిగ తాగాడు. ఆ సందర్భంగా 'మజ్జిగలో ఏం కలిపావమ్మా.. తియ్యగుంది' అని. లోకేష్ ఆమెతో అంటాడు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో 'తియ్యగుంది' అంటూ నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. ఇప్పటికీ దానిపై మీమ్స్ కనిపిస్తూ వుంటాయి. 'తిమ్మరుసు' చిత్రంలో ఇప్పుడు కావాలనే ఆ డైలాగ్ పెట్టారంటూ లోకేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో పేపర్ యాడ్ లో ఎన్టీఆర్ ని చూసి 'మన ఎన్టీఆర్' అంటూ బ్రహ్మాజీ చెప్పే డైలాగ్ ను కూడా ప్రస్తావిస్తున్నారు.
'తిమ్మరుసు' నిర్మాత కోనేరు మహేష్ నందమూరి హీరోలైన ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లతో సన్నిహితంగా ఉంటారనే సంగతి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. ఈ వివాదానికి ఇది కూడా ఒక కారణమే. కావాలనే లోకేష్ ను తగ్గించి ఎన్టీఆర్ మెప్పు పొందేందుకు ట్రై చేసారని విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా పేజీల్లో ఓ వర్గం నెటిజన్స్ దీనిపై డిస్కషన్ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.
అయితే డైరెక్టర్ రాసుకున్న ఈ చిన్న డైలాగా ప్రొడ్యూసర్ కు తెలిసే అవకాశం లేదని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాతకు అలాంటి ఇంటెన్షన్ ఉండకపోవచ్చని అంటున్నారు. అలానే చంద్రబాబు - బాలకృష్ణ గురించి ఏదైనా వస్తే ఫైట్ చేయాలి కానీ.. లోకేష్ గురించి అంత పట్టించుకునేవాళ్ళు లేకపోవచ్చని అంటున్నారు. ఏదేమైనా బ్రహ్మాజీ టైమింగ్ లో చెప్పిన డైలాగ్ లోకేష్ కు రిలేటెడ్ గా ఉండటంతో యాంటీ టీడీపీ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. మరి దీనిపై 'తిమ్మరుసు' చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.