Begin typing your search above and press return to search.
'వీర సింహారెడ్డి' పై వివాదం చెలరేగదు కదా..?
By: Tupaki Desk | 22 Oct 2022 1:30 PM GMTఏ సినిమాకైనా మంచి టైటిల్ అనేది చాలా అవసరం. ఎంత పెద్ద సినిమా అయినా.. స్టార్ హీరోలు నటించిన చిత్రాలైనా జనాల్లోకి వెళ్లాలంటే సరైన 'టైటిల్' పెట్టాల్సి ఉంటుంది. అందుకే మేకర్ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కథకు సరిపడేలా.. హీరో క్యారక్టర్ ని ఎలివేట్ చేసేలా మూవీ టైటిల్ ఉండాలని భావిస్తుంటారు.
ఇందులో భాగంగా కొన్ని సామాజిక వర్గాలకి చెందిన పేర్లను సినిమా టైటిల్స్ గా పెట్టడం.. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు అలాంటి పేర్లు పెట్టడం అనేది ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమాకు ''వీర సింహారెడ్డి'' అనే టైటిల్ ను పెట్టడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
నిజానికి కొందరు ఫిలిం మేకర్స్ అవసరం మేరకే క్యాస్ట్ ప్రస్తావన తీసుకొస్తారు. కథ డిమాండ్ చేయడంతోనే ఆలాంటి టైటిల్ పెట్టాల్సి వచ్చిందని మేకర్స్ సమర్ధించుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం అవసరం లేకున్నా కేవలం క్రేజ్ కోసం.. రీచ్ కోసం సామాజిక వర్గానికి సంబంధించిన పేర్లను పెడుతుంటారు. అప్పట్లో అలాంటి చిత్రాలపై పెద్దగా అభ్యంతరాలు రాలేదు కానీ.. ఇంటర్నెట్ వాడకం పెరిగిన తరవాత టైటిల్స్ వివాదాలు ఎక్కువ అయ్యాయి.
'మాలపిల్ల' 'జస్టిస్ చౌదరి' 'నాయుడుగారి కుటుంబం' 'నాయుడుగారి బావ' 'నాయుడుగారబ్బాయి' 'రాయలసీమ రామన్న చౌదరి' 'నరసింహనాయుడు' 'సమర సింహారెడ్డి' 'చెన్నకేశవరెడ్డి' 'భరతసింహారెడ్డి' 'పల్నాటి బ్రహ్మనాయుడు' 'సీమశాస్త్రి' 'నాయక్' 'అర్జున్ రెడ్డి' 'శైలజా రెడ్డి అల్లుడు' 'సైరా నరసింహారెడ్డి' 'జార్జ్ రెడ్డి' 'జాంబీ రెడ్డి' 'భీమ్లా నాయక్'.. ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సినిమాలు వచ్చాయి.
అందులో మెజారిటీ చిత్రాలు మంచి విజయాలు సాధించడం విశేషం. అయితే కొన్ని సామాజిక వర్గాలని ప్రతిభింబించేలా టైటిల్స్ పెట్టిన చిత్రాల్లో పాత్రల పేర్లు తీరుతెన్నులు అభ్యంతరకరంగా ఉండటం.. మరీ నెగిటివ్ గా చూపించడం వల్ల కొందరు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ విమర్శలు చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'జాంబీ రెడ్డి' సినిమా విషయంలో వివాదం చెలరేగింది. జాంబీలకు 'రెడ్డి' వర్గానికి సంబంధం ఏంటని కొందరు అభ్యంతరం తెలిపారు. క్రేజ్ కోసం ఓ సామాజిక వర్గాన్ని వాడుకొని కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ కాదని విమర్శించారు. అలానే 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో ఓ సామాజిక వర్గాన్ని ఫ్యాక్షన్సిస్టులుగా చూపించారని.. మితిమీరిన హింసను ప్రేరేపించారని ఓ స్టూడెంట్ వింగ్ అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తమ సామాజిక వర్గాల పేర్లను టైటిల్స్ గా పెట్టి కించపరచ వద్దని పలు సంఘాలు సినిమా వాళ్ళని కోరారు. అందుకే ఇటీవల కాలంలో ఫిలిం మేకర్స్ ఎవరూ అలాంటి టైటిల్స్ జోలికి వెళ్లడం లేదు. క్యారెక్టర్స్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత 'రెడ్డి' సామాజిక వర్గం పేరుని టైటిల్ లో జత చేస్తూ ''వీర సింహా రెడ్డి'' అనే సినిమాతో వస్తున్నారు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోంది. శుక్రవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వేదికగా టైటిల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. 'మ్యాన్ ఆఫ్ మాసెస్' అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ టైటిల్ లోగో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.
బాలయ్య రాజసానికి.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అతని పాత్ర వీరత్వానికి 'వీర సింహా రెడ్డి' సరైన టైటిల్ అని అంటున్నారు. అందులోనూ గతంలో 'నరసింహా నాయుడు' సమర సింహా రెడ్డి' 'సింహా' వంటి సినిమాలు హిట్ అవ్వడంతో.. సెంటిమెంట్ గా భావిస్తున్నారు.
ఇప్పటికైతే బాలయ్య సినిమా టైటిల్ పై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కథానాయకుడి పాత్ర పేరునే టైటిల్ గా పెట్టినప్పటికీ.. సినిమాలో మిగతా పాత్రల చిత్రీకరణ ఎలా ఉంటుందో అనే చర్చ మొదలైంది. 'వీర సింహా రెడ్డి' సినిమా విడుదలైన తర్వాతే ఈ విషయం మీద క్లారిటీ వస్తుంది. ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.