Begin typing your search above and press return to search.

సీఎం తో లారెన్స్... పోలీసులపై ఆరోపణలు!

By:  Tupaki Desk   |   30 Jan 2017 1:49 PM GMT
సీఎం తో లారెన్స్... పోలీసులపై ఆరోపణలు!
X
తమిళనాడులో జల్లికట్టు నిన్నమొన్నటివరకూ హాట్ టాపిక్. మెరీనా బీచ్ వేదికగా జరిగిన ఉద్యమం జల్లికట్టుకు అనుమతితేవడానికి ఎలా తోడ్పడిందీ దేశం మొత్తం చూసింది. ఈ వ్యవహారాన్ని అనేకమంది తమ తమ ఉద్యమాలకు స్పూర్తిగా కూడా తీసుకున్నారు. ఈ విషయాలపై తాజాగా ముఖ్యమంత్రిని కలిసిన రాఘవ లారెన్స్.. నాడు మెరీనా బీచ్ వేదికగా జరిగిన అన్ని సంఘటనలనూ వివరించారట.

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ఆయన నివాసంలో కలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన లారెన్స్... ఈ సందర్భంగా జల్లికట్టు నిర్వహణకు తగిన చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా... ఐదురోజుల పాటు శాంతియుతంగా జరిగిన జల్లికట్టు ఉద్యమం చివరిరోజు రసాభసగా మారడానికి పోలీసులే కారణమని, వారి తప్పుడు అవగాహన వల్లే ఆ సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు.

ఉద్యమం విజయవంతం కావడంతో 23జనవరి న 500కిలోల కేక్ తెప్పించుకుని మెరీనా బీచ్ లో విజయోత్సవ సభ జరపాలని అనుకున్నామని, ఐతే ఈ విషయంలో పోలీసుల నిర్వాకం వల్ల అది కాస్త రచ్చ రచ్చ అయ్యిందని లారెన్స్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎంకు కొన్ని విజ్ఞప్తులు కూడా లారెన్స్ చేశారు. అందులో ప్రధానమైంది... జల్లికట్టు ఉద్యమం ముగింపు రోజు జరిగిన హింసాకాండలో అరెస్టయిన ఉద్యమ కారులను విడుదల చేయాలని! ఇదే సమయంలో గాయాలపాలైన వారికి కూడా ప్రభుత్వమే వైద్యం అందించాలని కూడా కోరారు లారెన్స్!