Begin typing your search above and press return to search.

ఫేమస్ లవర్ ఒరిజినల్ కాదే

By:  Tupaki Desk   |   21 Sept 2019 4:33 PM IST
ఫేమస్ లవర్ ఒరిజినల్ కాదే
X
ఇటీవలే విడుదలైన విజయ్ దేవరకొండ కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. బాగా గాయపడిన మొహంతో కోపం నిండిన ఎక్స్ ప్రెషన్ తో గుప్పుమని పొగ వదులుతూ సిగరెట్ పట్టుకున్న పోస్టర్ బాగా వైరల్ అయ్యింది. అధిక శాతం ప్రేక్షకులు ఇది అర్జున్ రెడ్డి తాలూకు హ్యాంగ్ ఓవర్ అనుకున్నారు. పైగా టైటిల్ కూడా ప్రేమకు సంబంధించినది కావడంతో దీనికి చాలా ప్రచారం లభించింది. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.

మనవాళ్ళు సినిమా కథలు మాత్రమే కాదు పోస్టర్లు లుక్కులు కూడా ఇన్స్ పిరేషన్ గా తీసుకుంటున్నారని ఇప్పుడు అర్థమయ్యింది. నాలుగేళ్ల కిందట అంటే 2015లో లారెన్ విత్రో అనే ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ తన ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ చేసిన లుక్ ని కాపీ చేసి దానికి చిన్న మార్పులతో విజయ్ దేవరకొండతో రిపీట్ చేయించారన్న మాట. ఒక్క రోజు గడవకుండానే నెట్ లో దీని గుట్టు బయటపడటంతో సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ మొదలైంది

స్టోరీలను కాపీ కొట్టడం వరకు ఓకే కానీ ఇలా స్టిల్స్ ని కూడా చోరీ చేయడం ఏమిటని నెటిజెన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇది అనుమతి తీసుకుని చేసి ఉంటారని చెప్పలేం. పైగా లారెన్ విత్రో మనవాళ్లకు ఎవరికి తెలియదని నమ్మకమో ఏమో కానీ మొత్తానికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దీనికి రౌడీ బాబు ఏమంటాడో మరి. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ ని కెఎస్ రామారావు నిర్మిస్తుండగా నలుగురు హీరోయిన్లు విజయ్ దేవరకొండతో జట్టు కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు