Begin typing your search above and press return to search.

అల క‌థ కాపీ అంటూ రైట‌ర్ ఆరోప‌ణ‌

By:  Tupaki Desk   |   16 Feb 2020 8:16 AM GMT
అల క‌థ కాపీ అంటూ రైట‌ర్ ఆరోప‌ణ‌
X
సినిమా రిలీజైంది. బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టేసింది. 50రోజుల ఫంక్ష‌న్ కి టీమ్ రెడీ అవుతోంది. అయితే ఇంత దూరం వ‌చ్చాక‌.. ఈ క‌థ నాది.. కాపీ కొట్టేశారు! అంటూ బ‌య‌ట‌ప‌డ్డాడో ర‌చ‌యిత‌. సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ పైనే తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ నా క‌థ‌ను కాపీ కొట్టేసి అల వైకుంఠ‌పుర‌ములో తీశాడు.. అంటూ ర‌చ్చ‌కెక్కాడు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారంపై టాలీవుడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌తిసారీ సినిమా రిలీజ‌య్యాకే టాలీవుడ్ లో ఇలాంటి వివాదాలు బ‌య‌ట‌ప‌డుతుండ‌డం చూస్తున్న‌దే. ఇంత‌కుముందు పూరి తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ క‌థ నాదే అంటూ హీరో ఆకాష్ చేసిన ర‌చ్చను ఇంకా ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. చాలా సినిమాల విష‌యంలో రిలీజ్ త‌ర్వాత ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇప్పుడు అల వైకుంఠ‌పుర‌ములో క‌థ నాది అంటూ కృష్ణ అనే ర‌చ‌యిత ఆరోపించ‌డం హాట్ టాపిక్ గా మారింది.

ఇంత‌కీ అత‌గాడి వెర్ష‌న్ ఏమిటి? అంటే... 2005లో త్రివిక్రమ్ కి కృష్ణ ఓ క‌థ‌ను వినిపించాడ‌ట‌. 2013లో అదే కథని ఫిలిం ఛాంబర్‌ లో రిజిస్టర్ చేయించాడ‌ట‌. ఆ క‌థ‌నే దశ-దిశ అనే టైటిల్ తో తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని అనుకున్నాడ‌ట‌. కానీ ఆ క‌థ‌తోనే ఇప్పుడు`అల వైకుంఠపురములో` చిత్రం వ‌చ్చింద‌ని .. త్రివిక్ర‌మ్ త‌న క‌థ‌ను కాపీ కొట్టార‌ని కృష్ణ ఆరోపించారు. రైట‌ర్ కం డైరెక్ట‌ర్ కృష్ణ గురించి బ‌య‌ట తెలిసింది త‌క్కువే. ఆయ‌న చిన్న సినిమాల‌కు క‌థ‌లు అందించి ద‌ర్శ‌కుడిగానూ ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. అయితే మ‌రీ ఇలా 50రోజులు ఆడాక ఆరోపించ‌డంతో అత‌డి ఆరోప‌ణ‌ల్లో ప‌స లేకుండా పోయింద‌న్న వాద‌నా వినిపిస్తోంది. అల వైకుంఠ‌పుర‌ములో సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. నాన్ బాహుబ‌లి రికార్డులు కొల్ల‌గొట్టింది. అంతా అయ్యాక‌.. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెళ్ల‌కు పోలీసులు వెతికిన‌ట్టుగా ఉంది అంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.