Begin typing your search above and press return to search.
నా పేరు సూర్య హాలీవుడ్ కాపీనా?
By: Tupaki Desk | 29 Jan 2018 5:28 AM GMTటాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాపీ అనే పదం బాగా వినిపిస్తోంది. పెద్ద దర్శకులు రచయితలే అలాంటి పొరపాట్లు చేస్తుండడంతో చిత్ర పరిశ్రమపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ఏడాది డ్రగ్స్ వివాదం ఎలా అయితే టాలీవుడ్ కు మచ్చ తెచ్చిందో ఇప్పుడు కాపీ అనే పదం కూడా విమర్శలకు బాస్ ఇస్తోంది. గత కొంత కాలంగా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నా ఎక్కువగా హైలెట్ కాలేదు. కానీ ఎప్పుడైతే అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీ ఆధారంగా తెరకెక్కిందని వార్తలు వచ్చాయో అప్పటి నుంచి నెక్స్ట్ సినిమాలు కూడా అదే తరహాలో రాబోతున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ నా పేరు సూర్య కూడా కాపీ అని.. 2002లో వచ్చిన 'యాంట్వోన్ ఫిషర్' అనే హాలీవుడ్ మూవీ ఆధారంగా తెరకెక్కిందని రూమర్లు వినిపిస్తున్నాయి. సదరు ఇంగ్లీష్ సినిమాను కూడా.. ఫైండింగ్ ఫిష్ అనే నవల ఆధారంగా తీశారు. అది ఒక యదార్ధ కథ. ఆ కథలో హింసాత్మక గతం కలిగి ఉన్న యువకుడు తాను జీవించటానికి అమెరికా నావికాదళంలో చేరతాడు. అతని చిన్నతనంలో కఠినమైన జీవితం అతని హింసాత్మక స్వభావం కలిగిస్తుంది. కొన్ని పొరపాట్లు చేయడంతో కమాండింగ్ అధికారి అతన్ని చికిత్స కోసం సైకియాట్రిస్ట్ ని కలుసుకోవాలని సలహా ఇస్తారు. అలాగే కఠినమైన శిక్షలు వేస్తారు. అప్పుడు సైకియాట్రిస్ట్ ఆ యువకుడికి గాడ్ ఫాథర్ లా మారతాడు.
ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిదని సలహాలు ఇస్తుంటాడు. ఇదే పాయింట్ మనకు నా పేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ లో కనిపిస్తుంది. గాడ్ ఫాథర్ లా రావు రమేష్ బన్నీకి సలహాలు ఇస్తుంటాడు. దీంతో హాలీవుడ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. అయితే ఫస్ట్ ఇంపాక్ట్ లో బన్నీ తన నట విశ్వరూపాన్ని చూపించిన విధానం చూస్తుంటే కాపీ అనే పదం మైనస్ అయ్యేలా కనిపించడం లేదు. కానీ రచయితకు భవిష్యత్తులో అది మంచి పరిణామం కాదు. సినిమా హిట్ అయినా కాపీ అనే పదం సక్సెస్ లో చాలా చేదుగా ఉంటుంది. మరి సినిమా పూర్తిగా హాలీవుడ్ చిత్రంలా ఉంటుందా లేదా అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.