Begin typing your search above and press return to search.

ఇది విన్నారా! అనిరుద్ కాపీ కొట్టేశాడట

By:  Tupaki Desk   |   22 May 2018 6:08 AM GMT
ఇది విన్నారా! అనిరుద్ కాపీ కొట్టేశాడట
X
సౌత్ లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో అనిరుద్ ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి ప్రస్తుత జనరేషన్ కి ఎలాంటి ట్యూన్స్ ఇవ్వాలో బాగా తెలుసు. సినిమాలకు తగ్గట్టు మ్యూజిక్ ని ఇవ్వడంలో అనిరుద్ స్టైలే వేరు. గ్యాప్ లేకుండా ప్రస్తుతం కోలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు ఎలాంటి సంగీత దర్శకుడికైనా ఒక నెగిటివ్ కామెంట్ రాకుండా ఉండదు.

ఇతర పాటలకు వీళ్లు కంపోజ్ చేసిన ట్యూన్ కొంచెం మ్యాచ్ అయినా చాలు ట్రాల్స్ రావడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి అనిరుద్ కి ఆ ఎఫెక్ట్ కొంచెం గట్టిగానే తగిలినట్లు అనిపిస్తోంది. రీసెంట్ గా కొలమావు కోకిల (కోకో) అనే సినిమా కోసం కంపోజ్ చేసిన ఒక పాట కాపీ అని తెలుస్తోంది. నయనతార - కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమాలో కళ్యాణ వయసు అనే ఒక పాటను కంపోజ్ చేసిన ట్యూన్స్ ఇంగ్లీష్ సాంగ్ గి మ్యాచ్ అవుతున్నాయి. సనన్స్ - డోంట్ లై అనే సాంగ్ మ్యూజిక్ ని అనిరుద్ కాపీ కొట్టేశాడ్రోయ్ అంటూ నెటీజన్స్ ట్రాల్స్ చేయడం స్టార్ట్ చేశారు.

ఒకసారి ఆ రెండు సాంగ్స్ ని వింటే నిజమే అని అనిపించకుండా ఉండదు. కాపీ పేస్ట్ చేశాడు అని ఎన్ని కామెంట్స్ వస్తున్నా కూడా అనిరుద్ ఆ కామెంట్స్ పై రెస్పాండ్ అవ్వడం లేదు. ప్రస్తుతం సౌత్ లో ఆ న్యూస్ వైరల్ గా మారింది. మంచి సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ ఈ విధంగా చేశాడు అంటే తెలుగు నెటీజన్స్ నమ్మలేకపొతున్నారు.