Begin typing your search above and press return to search.

మహేష్‌ వెనుక కూడా హాలీవుడ్డేనా??

By:  Tupaki Desk   |   29 Jan 2018 1:08 PM IST
మహేష్‌ వెనుక కూడా హాలీవుడ్డేనా??
X
ఒక‌ప్ప‌టి తెలుగు సినిమా వేరు... ఎక్క‌డ నుంచి కాపీ కొట్టినా తెలిసేది కాదు. కానీ బాహుబ‌లి పుణ్య‌మాని... తెలుగు సినిమాకు అంత‌ర్జాతీయ ఖ్యాతి వ‌చ్చింది. దీంతో అన్ని ఇండ‌స్ట్రీలు తెలుగు సినిమాల‌పై కూడా ఒక లుక్ వేస్తున్నాయి. అందుకే ఎక్క‌డ నుంచి ఏమాత్రం కాపీ కొట్టినా వెంట‌నే విష‌యం బ‌య‌టికి వ‌చ్చేస్తుంది. అస‌లు విష‌యం ఏంటంటే... త్వ‌ర‌లో విడుద‌లయ్యే భ‌ర‌త్ అను నేను సినిమా క‌థ కూడా...ఓ హాలీవుడ్ మూవీ నుంచే పుట్టిందా?

కొత్త‌ద‌నానికి - పంచ్ డైలాగుల‌తోనే సినిమాను న‌డిపించ‌డానికి త్రివిక్ర‌మ్ పెట్టింది పేరు. అలాంటి డైరెక్ట‌ర్ కూడా ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్‌ ను కాపీ కొట్టే అజ్ఞాతవాసి తీశాడ‌ని కామెంట్లు వ‌చ్చాయి. అది నిజ‌మేన‌ని ఆ ఫ్రెంచ్ మూవీ డైరెక్ట‌ర్ కూడా సోష‌ల్ మీడియాలో కామెంట్ చేశాడు. ఇక భ‌ర‌త్ అను నేను విష‌యానికి వస్తే... 1995లో అమెరికాలో విడుద‌లైన ది అమెరికన్ ప్రెసిడెంట్ సినిమానే ఈ తెలుగు సినిమాకు స్పూర్తి అని టాక్స్ వినిపిస్తున్నాయి. అది నిజ‌మో కాదో ఇప్పుడు చెప్పే హ‌క్కు ఎవ‌రికీ లేదు. సినిమా విడుద‌ల‌య్యాకే అదెంత వ‌ర‌కు నిజ‌మో తెలుస్తుంది.

ఆ హాలీవుడ్ మూవీలో హీరో అమెరికా ప్రెసిడెంట్ గా ప్ర‌మాణ స్వీకారం చేస్తాడు. రెండు బిల్లును పాస్ చేసే విష‌యంలో చాలా ఇబ్బందుల‌కు గుర‌వుతాడు. త‌రువాత ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంటాయ్‌. ఆ స‌మ‌యంలోనే ఓ సామాజిక కార్య‌క‌ర్త‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అత‌ను అధికారంలోకి వ‌చ్చాక తాను చేసిన ప్ర‌మాణాల‌ను నెర‌వేర్చ‌లేద‌ని భావించి... హీరోయిన్ వ‌దిలిపోతుంది. తిరిగి వాళ్లిద్ద‌రూ వైట్ హౌస్‌ లో ఎలా క‌లిసార‌న్న‌దే సినిమా.

ఇక భ‌ర‌త్ అను నేను క‌థేంటో మ‌న‌కు పూర్తిగా తెలియ‌దు కాబ‌ట్టి. సినిమా విడుద‌లయ్యే వ‌ర‌కు ఆగి... క‌థ తెలిశాకే కామెంట్ చేయాలి.