Begin typing your search above and press return to search.
నాని సినిమా కాపీ?
By: Tupaki Desk | 14 Jan 2019 6:55 AM GMTకెరీర్ ఆరంభం నుండి కూడా నాని చాలా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేశాడు. వరుస విజయాలతో దూసుకు పోతున్న నాని గత సినిమా దేవదాస్ చాలా రొటీన్ గా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఆ కారణంగా నాని తన తదుపరి సినిమా ను చాలా భిన్నంగా చేయాలనే ఉద్దేశ్యంతో "జెర్సీ" సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.
క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన జెర్సీ టీజర్ అంచనాలను పెంచేసింది. లేటు వయసులో క్రికెట్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేసే క్రీడాకారుడి పాత్రలో నాని కనిపించబోతున్నాడు. లేటు వయసులో గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడే పాత్రలో నాని కనిపించబోతున్నాడు. టీజర్ విడుదలైన తర్వాత ఈ సినిమా హాలీవుడ్ మూవీ "ఇన్విన్సిబుల్" కథకు దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.
"ఇన్విన్సిబుల్" కథ ఫుట్ బాల్ నేపథ్యంలో సాగుతుంది. అందులో హీరో 30 ఏళ్ళు దాటినా తర్వాత దేశం తరపున ఫుట్ బాల్ ఆడేందుకు కష్టపడతాడు. తెలుగులో మాత్రం క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గౌతమ్. హాలీవుడ్ నుండి కథలను ప్రేరణగా తీసుకుని చేయడం కామన్, మరి ఈ సినిమాను దర్శకుడు ఎలా తీస్తాడో చూడాలి. ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.