Begin typing your search above and press return to search.

రాములో రాముల కాపీనా..స్ఫూర్తినా?

By:  Tupaki Desk   |   31 Oct 2019 5:34 AM GMT
రాములో రాముల కాపీనా..స్ఫూర్తినా?
X
కాపీకి స్ఫూర్తికి మ‌ధ్య స‌న్న‌ని లైన్ అడ్డు. అయితే ఇది కాపీనా? స‌్ఫూర్తినా? అన్న‌ది నిరంత‌రం హాట్ టాపిక్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `అల వైకుంఠ‌పుర‌ములో` రెండు లిరిక‌ల్ వీడియో సాంగ్స్ విడుద‌ల చేయ‌గా.. సెకెండ్ లిరిక‌ల్ రాములో రాముల పార్టీ సాంగ్ అయితే సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. అనురాగ్‌ కులకర్ణి-మంగ్లీ ఆల‌పించిన పాట‌కు అనూహ్య‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. యూట్యూబ్ లో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. సౌత్ లోనే అత్య‌ధిక వ్యూస్ ద‌క్కించుకున్న పాట‌గా రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సాంగ్ వివాదంలో చిక్కుకుంది. ఈపాట‌ తెలంగాణ పోక్ సాంగ్ ను పోలి ఉంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

`వ‌రంగ‌ల్లు చెరువు` అనే పాట ప‌ల్ల‌విని.. ఆ పాట‌లో కొన్ని లైన్లు కాపీ కొట్టిన‌ట్లు సోష‌ల్ మీడియాలో పెను దుమార‌మే రెగుతోంది. అలాగే పాట‌కు సంబంధించిన ట్యూన్స్ లిప్ట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లొస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో ఓ వ‌ర్గం నెటిజ‌నులు రెండు పాట‌ల్ని పోలుస్తూ జోరుగా ట్రోల్ చేస్తున్నారు. వ‌రంగ‌ల్లు చెరువు ఫోక్ సాంగ్ ను ఈఏడాది ఫిబ్ర‌వ‌రిలో యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు. అక్క‌డ జోరుగా ట్రెండ్ అయింది. దాదాపు 60ల‌క్ష‌ల వ్యూస్ ద‌క్కాయి. అంటే ఆ పాట యూ ట్యూబ్ ప్రేక్ష‌కుల్ని ఎంత‌గా మెప్పించిదో అర్ధ‌మ‌వుతోంది.

మ‌రి ఈ వివాదంపై సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో? చూడాలి. కొంద‌రు టాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కులు అప్పుడ‌ప్పుడు స్ఫూర్తిగా తీసుకుని త‌మ ట్యూన్స్ కి అనుగుణంగా మార్చుకుంటుంటారు. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు సంగీత ద‌ర్శ‌కుల‌పై కాపీ అనే ముద్రప‌డిన సంద‌ర్భాలున్నాయి. మ‌రి థ‌మ‌న్ అలాంటి ప్ర‌య‌త్నం చేసాడా? లేక ఆ పాట‌తో సంబంధం లేకుండా సొంత క్రియేటిటీతో రాములో రాముల‌ను క్రియేట్ చేసాడా? అన్న‌ది తెలియాలి. ఈ పాట‌ని కాస‌ర్ల శ్యామ్ ర‌చించారు.