Begin typing your search above and press return to search.

కాపీ కాదు.. ఇస్మార్ట్‌ `స్ఫూర్తి` అనాలా!

By:  Tupaki Desk   |   16 July 2019 6:02 AM GMT
కాపీ కాదు.. ఇస్మార్ట్‌ `స్ఫూర్తి` అనాలా!
X
కాపీ క్యాట్ వివాదాలు ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ‌సాధార‌ణంగా మారాయి. ఫ‌లానా హాలీవుడ్ సినిమా నుంచి లేదా కొరియ‌న్ సినిమా నుంచి క‌థ‌ను కాపీ కొట్టార‌ని లేదా కొన్ని సీన్లు ఎత్తేశార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏదో ఒక ఎలిమెంట్ ని కాపీ చేసినా ఫ‌క్తు కాపీ క్యాట్ అంటూ నెటిజ‌నులు తిట్టే(ట్రోల్స్‌)స్తున్నారు.

ఇదే కాపీ క్యాట్ వివాదం `ఇస్మార్ట్ శంక‌ర్` పైనా ముసురుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ గురువారం (జూలై 19న‌) రామ్ న‌టించిన మాస్ ఎంట‌ర్ టైన‌ర్ `ఇస్మార్ట్ శంక‌ర్` ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టీజ‌ర్ ఇప్ప‌టికే మాస్ లోకి దూసుకెళ్లింది. అయితే టీజ‌ర్ లో రామ్ క్యారెక్ట‌ర్ చూశాక‌.. అది హాలీవుడ్ సినిమాల‌కు కాపీ క్యారెక్ట‌ర్ అంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కొంద‌రు `ది క్రిమిన‌ల్` సినిమాకి కాపీ అంటూ విమ‌ర్శించారు. అలాగే 2017లో రిలీజైన `ఐ బోయ్` (ఆడ‌మ్ రండాళ్ ద‌ర్శ‌కుడు) అనే బ్రిటీష్ సినిమాని కాపీ కొట్టార‌ని విమ‌ర్శించారు. ఆ రెండు సినిమాల్లో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ కి ద‌గ్గ‌ర‌గా రామ్ పాత్ర చిత్ర‌ణ ఉంద‌ని విమ‌ర్శించ‌డం సంచ‌ల‌న‌మైంది. బ్రెయిన్ లోని మెమ‌రీస్ ని చిప్ అన్న పాయింట్ తో క‌నెక్టివిటీని ఉదాహ‌ర‌ణ‌గా చూపించారు.

అయితే ఈ కాపీక్యాట్ వ్య‌వ‌హారంపై పూరీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌దైన శైలిలో స్పందించారు. టాలీవుడ్ కు ఎలాంటి క‌థ‌లు వ‌చ్చినా హాలీవుడ్ నుంచే స్ఫూర్తి తీసుకుంటారు. ఈ క‌థ‌ను అక్క‌డ నుంచి స్పూర్తిగా తీసుకుని రాసాను... అని పూరి అంగీక‌రించారు. టాలీవుడ్ లో కొత్త జోన‌ర్ క‌థ‌లొస్తున్నాయి. ఈ జోన‌ర్ లో మాస్ సినిమా వ‌చ్చి చాలా రోజులైంది. ఆ లోటును ఇస్మార్ట్ శంక‌ర్ తీరుస్తుంది అని అన్నారు. ``నా ప్ర‌తి సినిమాలో కొత్త పాయింట్ ఉండాల‌నుకుంటాను. కొత్త‌గా తీయాల‌నే ప్ర‌య‌త్నం చేస్తాను. కాక‌పోతే సినిమా ఆడితే వెద‌వ కూడా జీనియ‌స్ లా క‌నిపిస్తాడు. ఆడ‌క‌పోతే జీనియ‌స్ కూడా వెద‌వ అయిపోతాడు. విజ‌యాన్ని బ‌ట్టే త‌ప్పొప్పుల్ని నిర్ణ‌యిస్తారు`` అని పూరి కాస్తంత ఘాటుగానే వ్యాఖ్యానించారు. రామ్ ను గుడ్ బోయ్ గా చూసి బోర్ కొట్టింది. అందుకే బ్యాడ్ బోయ్ గా చూపిస్తున్నా. రామ్ తో నేను సినిమా చేయాల‌ని మీడియా కోరుకుంది కాబ‌ట్టే ఈ సినిమా చేశాన‌ని పూరి చెప్ప‌డం కొస‌మెరుపు.

మొత్తానికి ఇస్మార్ట్ శంక‌ర్ క‌థ కాపీ కాదు కేవ‌లం స్ఫూర్తి పొంది రాసుకున్న కథ అని పూరి ముక్తాయించారు. అయితే విమ‌ర్శ‌కులు సైతం నేరుగా యాజ్ ఇట్ ఈజ్ కాపీ అని తిట్టేయ‌లేదు. కేవ‌లం మెమ‌రీ చిప్ అన్న కాన్సెప్టు నుంచి స్ఫూర్తి పొంది పూరి క‌థ రాసుకున్నార‌నే విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం మెమ‌రీ చిప్ పాయింట్ కొత్త‌గా ఉన్నంత మాత్రాన సినిమాని ఆద‌రిస్తార‌ని అనుకోలేం. ఇందులో క‌థ ప‌రంగా పూర్తి కొత్త‌ద‌నం కావాలి. అలాగే స్క్రీన్ ప్లే ప‌ర‌మైన జిమ్మిక్కులు లేక‌పోతే క‌ష్ట‌మే.