Begin typing your search above and press return to search.
ఓవైపు కరోనా కల్లోలం.. ఈవిడేంటి దింకచిక!
By: Tupaki Desk | 21 March 2020 6:45 AM GMTఓవైపు కరోనా కల్లోలం కొంపలంటిస్తుంటే మరోవైపు ఈవిడేంటి దింకచిక అంటోంది? వరల్డ్ హ్యాపీనెస్ డే అంటూ ఊరూవాడా సెలబ్రేషన్ చేస్తోంది. ఉన్నట్టుండి మాంచి డ్యాన్సింగ్ మూడ్ లోకి వెళ్లిపోయి దింకచిక ఆడేస్తోంది. ఇవేమైనా దబాంగ్ డేస్ అనుకుంటోందా? సక్సెస్ తో వచ్చిన గ్లోతో ఇలా హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోవడానికి..? అయినా అసలీ సోనా ఏంటిలా చేస్తోంది?
ప్రపంచ దేశాల్ని చుట్టుముట్టేసిన కరోనా మహమ్మారీ ఇండియాని గజగజ ఒణికిస్తోంది. ఇప్పటికే 200 పాజిటివ్ కేసులు అంటే అనధికారికంగా బయటపడనివి ఎన్ని? అన్న ఆందోళన నెలకొంది. బయట తిరగాలంటేనే గజగజలాడిపోతున్నారు. ఎక్కడో చైనా వుహాన్ లో ప్రారంభమైనది ఇప్పుడు మహమ్మారిగా మారింది. కరోనా వైరస్ సామాజిక కల్లోలం గా మారింది. ఈ దెబ్బకు అన్నీ బంద్. కార్యాలయాలు మూసివేసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారంతా. ఫిల్మ్ - టీవీ షూటింగుల్ని నిలిపివేశారు. ఇటువంటి అల్లకల్లోల కాలంలో.. కరోనావైరస్ పై అవగాహన కల్పించడానికి అనేక మంది నటులు ముందుకు రావడం ప్రశంసనీయం. అందరితో పాటు నేను సైతం అంటూ దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కరోనాపై ప్రచారం చేస్తున్నా.. ఉన్నట్టుండి డ్యాన్సింగ్ చేస్తూ `వరల్డ్ హ్యాపీనెస్ డే` అంటూ ఇలా చిందేయడమేమిటో? అసలు ఈ సందర్భానికి అతికే చిందులేనా? ఇవి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.
ఇక కరోనావైరస్ భయంతో షూటింగులు రద్దు కావడంపైనా సోనాక్షి సిన్హా స్పందిస్తూ..``నా గుండె కు ఇబ్బందికరంగా ఉంది`` అని బాధను వ్యక్తం చేసింది. క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో ఉన్నాను. కరోనా వైరస్ మహమ్మారి ఇంత పని చేస్తుందనుకోలేదని వాపోయింది. రోజువారీ వేతన కార్మికులు .. పూట గడవని చిన్న సాంకేతిక నిపుణుల విషయమై ఆందోళనను వ్యక్తం చేసింది. నష్టాలు తగ్గడానికి సన్నివేశం సాధారణ స్థితికి రావాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపింది.
కరోనా వల్ల నేను ఇంట్లోనే వ్యాయామం చేస్తున్నాను. నా తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపాను. నా పెట్ డాగ్ గురించి.. నా పాత అభిరుచుల గురించి తిరిగి గుర్తు చేసుకున్నాను. సరైన జాగ్రత్తలు తీసుకోవడంపై మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. నేను మారను అనే మనస్తత్వాల్ని మార్చాలి. ఇది మన గురించి ఆలోచించే సమయం కాదు. మంచి ప్రయోజనం కోసం ఆలోచించాలి. రోజురోజుకు పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. కోవిడ్ 19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటలీకి పరిస్థితులు ఎలా వేగంగా మారాయో చూశాం. కాబట్టి ఇళ్లలోనే ఉండండి. సురక్షితంగా ఉండండి`` అని సోనాక్షి సందేశం అందించింది.
దీంతో పాటే నేటి వరల్డ్ హ్యాపీనెస్ డే గురించి మాట్లాడుతూ.. డ్యాన్స్ నాకు సంతోషాన్నిస్తుంది. మనకు సంతోషాన్ని కలిగించే ఇంట్లో మనం చేయగలిగేదాంతోనే అంతా కలిసి కట్టుగా # కొరోనాపై పోరాడదాం! #JantaCurfew సరైన ఆలోచన .. ఆ దిశలో ఒక అడుగు వేద్దాం. ఇంటి వద్ద ఉండండి. భయాందోళనలను ఆపుదాం. సీనియర్ సిటిజనులు వారి రోజువారీ అవసరాలను నిల్వ చేసుకోవడంలో సహాయపడదాం`` అని ఇన్ స్టాలో వ్యాఖ్యను షేర్ చేసింది.
For Video >> https://www.instagram.com/p/B99W6rlAkTl/

For Video >> https://www.instagram.com/p/