Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్ : పదేళ్ల క్రితం సినిమాకు ఇప్పుడు డిమాండ్
By: Tupaki Desk | 12 March 2020 3:28 PM GMTప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా భయం తో వణికి పోతున్నారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ నూరుకు పైగా దేశాల జనాలను పట్టి పీడిస్తుంది. ప్రాణభయం తక్కువే అయినా కూడా చాలా ఈజీగా సోకుతున్న కారణంగా అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. అత్యంత దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక సినిమాకు మాత్రం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి.
హాలీవుడ్ లో 2011లో వచ్చిన కంటేజియాన్ సినిమా ఇప్పుడు నెటిజన్స్ కు పని పెట్టింది. ఈ సినిమా గురించి.. ఈ సినిమాలోని కథ గురించి నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. అమెరికా లో ప్రస్తుతం ఇంటర్నెట్ నుండి అత్యధికంగా డౌన్ లోడ్ అవుతున్న సినిమాగా ఇది నిలిచింది. కంటేజియాన్ సినిమా ఒక వైరస్ బారిన పడి జనాలు మృతి చెందడం నేపథ్యంలో తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వైరస్ ఎంతలా ఇబ్బంది పెట్టింది అనేది ఆ సినిమా కథ.
కరోనా వైరస్ చైనాలో పుట్టినట్లుగానే కంటేజియాన్ సినిమాలో ని వైరస్ కూడా చైనా లో పుట్టింది. కరోనా వైరస్ గబ్బిలం నుండి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ సినిమాలో కూడా గబ్బిలం నుండి పందికి వచ్చి అక్కడ నుండి మనిషికి వచ్చినట్లుగా చూపించారు. ప్రస్తుత పరిస్థితులకు చాలా దగ్గరగా ఆ సినిమా ఉండటం వల్ల కంటేజియాన్ సినిమా గురించి నెటిజన్స్ చాలా ఆసక్తి చూపిస్తూ ఆ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
2011లో వచ్చినప్పుడు ఆ సినిమాను పెద్దగా ఆధరించని ప్రేక్షకులు ఇప్పుడు మాత్రం నెట్ లో డౌన్ లోడ్ చేసుకుని మరీ చూసేందుకు ఆసక్తిని కనబర్చుతున్నారు. కరోనా వైరస్ వల్ల ఎన్నో హాలీవుడ్ సినిమాలు ఆగిపోతే కంటేజియాన్ సినిమా పాతదైనా ఇప్పుడు డిమాండ్ వచ్చింది.