Begin typing your search above and press return to search.
కరోనా శెలవులు.. విలవిలలాడుతున్న ఈవెంట్ సంస్థలు!
By: Tupaki Desk | 18 March 2020 11:03 AM GMTటాలీవుడ్ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. తెలుగు సినిమాలపై ఆధారపడి ఎన్నో కంపెనీలు మనుగడ సాగిస్తాయి. అలాంటి వాటిలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు కూడా ఉంటాయి. సినిమా ఫంక్షన్లు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అందులోనూ ఎవరో ఒక స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ హాజరవుతారంటే చాలు ఆ కార్యక్రమం ఆటోమేటిక్ గా క్రేజీగా మారిపోతుంది. ఇలాంటి ఈవెంట్లు అన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు నిర్వహిస్తాయి. రెగ్యులర్ గా ఏదో ఒక సినిమా ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ సంస్థలకు చేతినిండా పని ఉంటుంది. కరోనా దెబ్బకు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు విలవిలలాడుతున్నాయని సమాచారం.
టాలీవుడ్ లో రెండు ప్రముఖ ఈవెంట్ మేనేజెమెంట్ సంస్థలు రొటేషన్ పద్దతిలో ఈవెంట్స్ నడిపిస్తారు. వీరికి వారానికి కనీసం ఒక్కటైనా ఈవెంట్ ఉండాలి. లేకపోతే కంపెనీలు నష్టాల్లోకి జారుకునే అవకాశం ఉందని సమాచారం. పదిహేను రోజుల శెలవుల కారణంగా ఈవెంట్లు మొత్తం రద్దయ్యాయి. కోవిడ్-19 కనుక కంట్రోల్ లోకి రాకపోతే మరి కొన్ని రోజులు టాలీవుడ్ లో ఈవెంట్ లు రద్దయ్యే అవకాశం ఉంది.
ఈ కంపెనీలు గతంలో నిర్వహించిన ఈవెంట్ల డబ్బు కూడా ఇంకా అందక పోవడం... కొత్తగా ఈవెంట్లు లేకపోవడం తో ఈ సంస్థలకు నష్టాలు తప్పవని.. ఈ నష్టాలు పూడ్చుకోవాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా కరోనా ప్రభావం చాలామందిపై చూపిస్తోంది. ఈవెంట్ మేనేజెమెంట్ కంపెనీలు కూడా దాని దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.