Begin typing your search above and press return to search.

దిస్ ఫ్రేడే క‌రోనా ఎఫెక్టెడ్ నా?

By:  Tupaki Desk   |   6 March 2020 9:05 AM GMT
దిస్ ఫ్రేడే క‌రోనా ఎఫెక్టెడ్ నా?
X
ప్ర‌తి శుక్ర‌వారం ఏదో ఒక సినిమా రిలీజ‌వుతూనే ఉంది. ఒక్కోసారి రెండు మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీపడుతున్నాయి. అయితే సినిమాల రిలీజ్ ల‌కు గుడ్ సీజ‌న్.. బ్యాడ్ సీజ‌న్ అని డివైడ్ చేసి చూడాల్సి ఉంటుంది. అలా చూస్తే ఇది ప‌రీక్ష‌ల కాలం. ఫిబ్ర‌వ‌రి- మార్చి అంటే విద్యార్థులంతా ప్రిప‌రేష‌న్ లో బిజీగా ఉంటారు. ప‌రీక్ష‌ల‌కు ఎటెండవుతుంటారు. దాని వ‌ల్ల కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సినిమాలు చూసే ప‌రిస్థితి ఉండ‌దు. దీనికి తోడు క‌రోనా భ‌యం ఒక‌టి థియేట‌ర్ల‌కు ముప్పుగా మారింద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.

ఆ కోణంలో చూస్తే ఈ శుక్ర‌వారం రిలీజైన సినిమాల ప‌రిస్థితేమిటి? అంటే... ఇప్ప‌టివ‌ర‌కూ వీటికి అడ్వాన్స్ బుకింగులు ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేవ‌ని తేలింది. కేవ‌లం 15 శాతం లోపు మాత్ర‌మే బుకింగులు అవుతున్నాయంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఓవైపు స్టూడెంట్స్ ప‌రీక్ష‌ల టెన్ష్ లో ఉంటే సినిమాలు రిలీజ్ చేస్తే ఏం ఉప‌యోగం? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఈ వారం రిలీజైన పలాస 1978- ఓ పిట్ట కథ - అనుకున్న‌ది ఒక్క‌టి అయిన‌ది ఒక్క‌టి చిత్రాల ప‌రిస్థితేమిటి? అంటే.. ప్చ్ అని పెద‌వి విరిచేస్తున్నారు. అంతా కొత్త కుర్రాళ్లు న‌టిస్తున్న సినిమాలు అయినా వీటికి సంబంధించిన ట్రైల‌ర్స్ ఆక‌ట్టుకోవ‌డం తో థియేట‌ర్లు ఫిల్ అవుతాయ‌నే భావించారు. కానీ సీన్ మాత్రం పూర్తి రివ‌ర్సులో ఉంద‌ని తెలుస్తోంది.

ఇక ఏ నోట విన్నా క‌రోనా క‌రోనా క‌రోనా! అంత‌గా ఒణికిస్తున్న‌ప్పుడు ఇంకేం థియేట‌ర్ల‌కు వ‌స్తారు జ‌నం? స‌రిగ్గా రాంగ్ టైమ్ లో రిలీజ్ చేశారా? అంటూ ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. అయితే ప‌లాస చిత్రం ఈపాటికే రిలీజ్ కావాల్సిన‌ది ఇప్పుడు రిలీజైంది. ఏదైనా మంచి సినిమాకి మంచి రిలీజ్ కావాలి! అంటూ ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత‌లు అంతా ఎంతో వేచి చూస్తున్నారు. కింగ్ నాగార్జున అంత‌టివారే మంచి రిలీజ్ అంటూ నెల‌ల‌కొద్దీ వెయిట్ చేసిన సంద‌ర్భాలున్నాయి. అందుకే నిర్మాత‌లు తెలివైన ప్ర‌ణాళిక‌తో వ‌స్తేనే ఏదైనా గ‌ట్టెక్కేందుకు అవ‌కాశం ఉంటుంది అంటూ విశ్లేషిస్తున్నారు.