Begin typing your search above and press return to search.

#టాలీవుడ్ .. మ‌హ‌మ్మారీ భ‌యానికి పూర్తిగా చెక్ పెట్టేదెలా?

By:  Tupaki Desk   |   18 March 2021 2:30 PM GMT
#టాలీవుడ్ .. మ‌హ‌మ్మారీ భ‌యానికి పూర్తిగా చెక్ పెట్టేదెలా?
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ గ్రేట్ కంబ్యాక్ గురించి స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వ‌రుస‌గా సినిమాలు రిలీజై వంద శాతం ఆక్యుపెన్సీతో రికార్డుల్ని బ్రేక్ చేస్తుంటే అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. క‌రోనా భ‌యాల్ని వ‌దిలించుకుని జ‌నం థియేట‌ర్ల వైపు రావ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌స్తుతం జ‌నాల అశ్ర‌ద్ధ వ‌ల్ల‌నో లేక ప్ర‌భుత్వాలు లైట్ తీస్కోవ‌డం వ‌ల్ల‌నో మ‌హ‌మ్మారీ సెకండ్ వేవ్ మ‌ళ్లీ ఇబ్బందిక‌రంగా మారింది. ముంబై - కేర‌ళ‌కే ప‌రిమితం అనుకున్న‌ది కాస్తా ఇప్పుడు అన్ని రాష్ట్రాల‌కు పాకుతోంది. కేసులు నెమ్మ‌దిగా పెర‌గ‌డంపై ఆందోళ‌న నెల‌కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక స్కూల్ లో కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో మొత్తం వ్య‌వ‌స్థ‌నే కొన్నాళ్ల పాటు మూసేయాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తోంద‌ట‌. అయితే దీని ప్ర‌భావం థియేట‌ర్ల‌కు వెళ్లే జ‌నాల పైనా ప‌డుతుందా? థియేట‌ర్ల‌ను మూసేస్తారా? అంటూ తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో గుబులు రేగుతోంది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఎగ్జిబిష‌న్ రంగం పూర్తిగా డైల‌మాలో ఉంది. తీవ్ర న‌ష్టాల‌తో క‌ష్టాల్లో ఉంది. కాబ‌ట్టి వినోద రంగం వ‌ర‌కూ ఏం చేస్తారు? అన్న‌ది కూడా స‌స్పెన్స్ గా మారింది.

మునుముందు రంగ్ దే- ల‌వ్ స్టోరి- వ‌కీల్ సాబ్ స‌హా ప‌లు క్రేజీ చిత్రాలు రిలీజ్ బ‌రిలో ఉన్నాయి. ఇవ‌న్నీ చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలుగా నిలుస్తాయ‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాల‌న్నీ భారీ బిజినెస్ పూర్తి చేసుకుని వ‌సూళ్ల‌పై ధీమాగా ఉన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో మ‌హ‌మ్మారీ సెకండ్ వేవ్ అన్న టెన్ష‌న్ నిర్మాత‌ల‌ను వ‌దిలి పెట్ట‌డం లేదు.

ఒక‌వేళ క‌రోనా మ‌రీ ఇబ్బంది పెడితే కొంత‌వ‌ర‌కూ ఓటీటీ ఆప్ష‌న్ కాపాడుతుంది. అయితే ఎప్ప‌టివ‌ర‌కూ మ‌హ‌మ్మారీని క‌ట్ట‌డి చేయ‌గ‌ల‌రు? అన్న‌దానిపై క్లారిటీ మిస్స‌యితేనే ఇబ్బందిక‌రం. ఇప్ప‌టికే క‌రోనా వ్యాక్సినేష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది కాబ‌ట్టి కొంత‌వ‌ర‌కూ భ‌య‌ప‌డాల్సిందేమీ లేదని అంచ‌నా వేస్తున్నారు. కానీ ప్ర‌భుత్వాలే శ్ర‌ద్ధ తీసుకుని పూర్తి కంట్రోల్ తేలేక‌పోవ‌డంతో ఇలానే ఈ ఇబ్బంది కొన్నాళ్లు కొన‌సాగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.