Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ కు ఎదురుదెబ్బ..!
By: Tupaki Desk | 26 April 2021 10:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా థియేట్రికల్ రన్ చివరి దశకు వచ్చింది. పవన్ రీ ఎంట్రీ మూవీగా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి ఓవర్ సీస్ లో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. అక్కడ మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ దురదృష్టవశాత్తు వసూళ్ళ పరంగా అంచనాలను అందుకోలేక పోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కోవిడ్ కారణంగా ఓవర్ సీస్ మార్కెట్ పై బాగా దెబ్బ పడిందని చెప్పవచ్చు. విదేశాలలో సెకండ్ వేవ్ ఉధృతికి జనాలు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడటం కంటే ఓటీటీలో చూడటాన్ని ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో 'జాతిరత్నాలు' సినిమా 1 మిలియన్ డాలర్ల వరకు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇక పవర్ స్టార్ సినిమా కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే 'జాతి రత్నాలు' తో పోలిస్తే, 'వకీల్ సాబ్' తక్కువ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం, యూఎస్ఏలో 'వకీల్ సాబ్' చిత్రం సుమారు 750K డాలర్స్ వసూలు చేసింది. అలానే ఆస్ట్రేలియాలో ఈ చిత్రం 295K కలెక్షన్స్ రాబట్టగా.. 'జాతి రత్నాలు' 315K పైగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా - సింగపూర్ - ఆస్ట్రేలియా - యూఏఈ.. ఇలా ఏరియాల వారిగా 'వకీల్ సాబ్' ఓవర్ సీస్ రైట్స్ కొనుకున్న డిస్ట్రీబ్యూటర్లు నష్టపోయారని ట్రేడ్ టాక్. దీనికి కోవిడ్ సెకండ్ వేవ్ ఒక్కసారిగా విజృంభించడం కూడా కారణంగా తెలుస్తోంది.
అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వచ్చినప్పటికీ ఈ సినిమా నిర్మాత దిల్ రాజు గట్టెక్కినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. బాక్సాఫీస్ లెక్కలు అధికారికంగా చెప్పనప్పటికీ ఇది పవన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచిందని ప్రచారం జరుగుతోంది. కాగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన 'వకీల్ సాబ్' చిత్రాన్ని బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేయేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మించారు. ఇందులో శ్రుతి హాసన్ - నివేదా థామస్ - అంజలి - అనన్య - ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. థియేట్రికల్ రన్ పూర్తవుతోంది కాబట్టి ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.