Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' కు ఇంకో పెద్ద దెబ్బ?

By:  Tupaki Desk   |   12 April 2021 3:32 AM GMT
వకీల్ సాబ్ కు ఇంకో పెద్ద దెబ్బ?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపైకి ఎంటర్ అయ్యాడు. ఆయన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు..అందులోనూ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాన్ని అభిమానులు ఆదరిస్తారా వంటి అనేక అనుమానాలు.అయితే అన్నిటినీ పటాపంచలు చేస్తూ 'వకీల్ సాబ్' అన్ని సెంటర్లలోనూ సత్తా చాటింది. చాలా చోట్ల ఫస్ట్ డే రికార్డులు తిరగరాశారు వకీల్ సాబ్. రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్త్ తో స్ట్రాంగ్ గానే ఉంది. అయితే మూడో రోజు కాస్త డ్రాప్ కనిపించిందని వినపడింది. కరోనా భయంతో ఫ్యామిలీలు థియోటర్ కు రావటానికి జంకుతూండటం కారణం అని లెక్కేసారు.

అయితే కరోనా కు తోడుగా ఈ సినిమా కలెక్షన్స్ పై మరో ఎఫెక్ట్ ఈ చిత్రం పడుతున్నట్లు వెల్లడైంది. రీసెంట్ గా మొదలైన ఐపీఎల్ మ్యాచులు వకీల్ సాబ్ ఈవెనింగ్ షోల కలెక్షన్స్ కు గండి కొడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మేజర్ టీం మ్యాచులు నుంచే ఈ ఎఫెక్ట్ కనపడుతోంది. గతంలోనూ ఐపీఎల్ తో సినిమా కలెక్షన్స్ బాగా దెబ్బతిన్నాయి. అసలే బయిట కరోనా, దాంతో ఇంట్లో కూర్చుని ఐపీఎల్ చూద్దామని చాలా మంది ఫిక్స్ అయ్యిపోయారు. దానికి తోడు ఓటీటిలో ఏ సినిమా అయినా ఓ నెలలో వచ్చేస్తుందనే నమ్మకం. ఇవన్ని వకీల్ సాబ్ థియోటర్ కలెక్షన్స్ రికార్డ్ లకు దెబ్బేస్తున్నాయి.

అయితే సాలిడ్ మౌత్ టాక్ తెచ్చుకోవటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ వేణు శ్రీరామ్ మేకింగ్, సెకండాఫ్ సీన్స్, డైలాగ్స్ ప్లస్ అయ్యాయి. మల్టిఫ్లెక్స్ మూవిగా ఉన్న 'పింక్' సినిమాను తెలుగు నేటివికీ,ముఖ్యంగా పవన్ అభిమానులకు నచ్చేలా హీరోయిజం ఎలివేట్ చేయటం కలిసొచ్చింది. అలాగే ఈ చిత్రంలో అంజలి, అనన్య, నివేదా నటనకు మంచి మార్కులు పడ్డాయి. కరోనా, ఐపీఎల్ లేకపోతే ఖచ్చితంగా కొత్త రికార్డ్ ల వేట కొనసాగేది.