Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' కు మహిళల బ్రహ్మరథం..!
By: Tupaki Desk | 14 April 2021 3:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. 'పింక్' రీమేక్ తెరకెక్కిన ఈ కోర్టు డ్రామాలో మహిళల పై జరుగుతున్న లైంగిక దాడుల గురించి చర్చించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్ల దగ్గర మగువల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చోట్ల 80 శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీ మహిళలతోనే నిండుతుందంటే వకీల్ సాబ్ వాళ్లను ఎంతగా ఆకట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ సినిమాలని అభిమానులు, యూత్ ఆడియన్స్ ఎలాగూ సినిమా చూస్తుంటారు. అయితే 'వకీల్ సాబ్' కోసం థియేటర్లలో మహిళలు పెద్ద సంఖ్యలో అడుగుపెట్టడంతో ఆయా థియేటర్లు కళకళలాడుతున్నాయని తెలుస్తోంది. థియేటర్ల వద్ద మగువల సందడి చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎవరికి చేరాలో వారికి దగ్గరైందంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. ఇకపోతే వైజాగ్ లో సందీప్ పంచకర్ల అనే ఒక డాక్టర్ అనాథ బాలలను 'వకీల్ సాబ్' మూవీకి తీసుకెళ్లారు. వారందరూ సినిమా చూస్తూ ఎంతో సంతోషించారని ఆయన ట్వీట్ చేశారు. 'వకీల్ సాబ్' సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు.