Begin typing your search above and press return to search.

ప్రదీప్‌ కు కలిసి వచ్చిన కరోనా లాక్‌ డౌన్‌ పీరియడ్‌

By:  Tupaki Desk   |   6 April 2020 12:30 PM GMT
ప్రదీప్‌ కు కలిసి వచ్చిన కరోనా లాక్‌ డౌన్‌ పీరియడ్‌
X
బుల్లి తెరపై సూపర్‌ హిట్‌ అయిన యాంకర్‌ ప్రదీప్‌ వెండి తెరపై కనిపించబోతున్నాడు. గతంలో పలు సార్లు ప్రదీప్‌ సినిమాల్లో కనిపించాడు. కాని ఈసారి హీరోగా ప్రదీప్‌ వెండి తెరపై మొదటి సారి కనిపించబోతున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంతో ప్రదీప్‌ హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. ఈ కరోనా విపత్తు రాకుంటే ఈపాటికి సినిమా వచ్చేది ఫలితం ఏంటో కూడా తేలిపోయేది. కాని కరోనా కారణంగా థియేటర్లను మూసేయడం ఇంకా సినిమా విడుదల ఆగిపోవడం జరిగింది.

సినిమా విడుదల ఆగిపోతే ఆగిపోయింది కాని సినిమాకు మంచి పబ్లిసిటీ అయితే దక్కింది. ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాటను యూట్యూబ్‌.. సావన్‌ ఇంకా ఇతర ఫ్లాట్‌ ఫామ్‌ లపై తెగ శ్రోతలు వింటున్నారు. ఇప్పటి వరకు ఈ పాటకు 100 మిలియన్‌ వ్యూస్‌ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఆ వ్యూస్‌ లో కనీసం ఒక్క శాతం ప్రేక్షకులు వచ్చి సినిమాను చూసినా కూడా సినిమా సూపర్‌ హిట్‌ అయినట్లే.. హీరోగా ప్రదీప్‌ కు మంచి బ్రేక్‌ దక్కినట్లే అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రదీప్‌ ను చూస్తుంటే బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో ఆయుష్మాన్‌ ఖారానా మాదిరిగా బుల్లి తెర నుండి వెండి తెరకు ఎంట్రీ ఇచ్చి వెండి తెరపై సెటిల్‌ అవ్వడం ఖాయంగా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుల్లి తెరపై తన టైమ్‌ సెన్స్‌ ఇంకా కామెడీ టైమింగ్‌ తో యాంకరింగ్‌ చేస్తూ అమ్మాయిలను అభిమానులుగా మార్చుకున్న ప్రదీప్‌ వెండి తెరపై ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడో చూడాలి. ఈ లాక్‌ డౌన్‌ పీరియడ్‌ అయిన తర్వాత ఈనెలాఖరుకు లేదా వచ్చే నెలలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.