Begin typing your search above and press return to search.

పాపం.. కనికా, ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా విషయంలో బయటపడ్డ నిజాలు

By:  Tupaki Desk   |   27 March 2020 7:30 AM GMT
పాపం.. కనికా, ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా విషయంలో బయటపడ్డ నిజాలు
X
కనికా కపూర్...ఇప్పుడు ఇండియాలో ఈ పేరు తెలియని వారుండరు. సింగర్ గా ఎంతమందికి తెలుసో గానీ కరోనా వల్ల దేశం మొత్తం గుర్తు పట్టే స్టేజ్ కి వచ్చేసింది. ఆమె గురించి ఇప్పుడు మళ్లీ ఒక వార్త హల్ చల్ చేస్తోంది. బ్రిటన్ రాజవంశీయుడు ప్రిన్స్ ఛార్లెస్‌కు కరోనా వైరస్ పాజిటీవ్ రావడంతో యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆయనకు కరోనా వైరస్ సోకడానికి కారణం కనికా కపూరేననే ప్రచారం సాగుతోంది. ఆమె ఇటీవల ప్రిన్స్ చార్లెస్‌ను కలిసిందని, ఆమె నుంచే ఆయనకు కరోనా సోకిందనే వార్తలు, ఫొటోలు నెట్టింట షికారు చేస్తున్నాయి. దీంతో నెటిజనులు ఆమెను దారుణంగా విమర్శిస్తున్నారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని ప్రముఖులను కూడా కనికా ప్రమాదంలోకి నెట్టేసిందని విమర్శిస్తున్నారు. అక్కడితో ఆగకుండా నీవల్ల ఆయనకి వచ్చిందా, ఆయన వల్ల నీకొచ్చిందా.. అంటూ కామెంట్స్ కూడా చేసారు. కనికా కపూర్ ప్రస్తుతం లక్కోలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

ఇటీవల లండన్ నుంచి ఇండియాకు వచ్చిన ఆమె.. నిబంధనలు పాటించకుండా పలు పార్టీలకు హాజరై ప్రముఖులను కలిసింది. కనికాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే వారంతా ఇప్పుడు ఐసోలేషన్‌లో ఉన్నారు. కనీస నియమాలు పాటించకుండా ఆమె ఇతరులు ప్రమాదకరంగా మారడంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సోషల్ మీడియా కూడా ఆమెను ‘కరోనా కపూర్’ అంటూ ఏకేస్తున్నారు. ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు నిర్ధారణ కావడంతో నెటిజనులు మరోసారి కనికాకపై విరుచుకుపడుతున్నారు. ఆమె వల్లే ఆయనకు కరోనా వచ్చిందని నిందలు వేస్తున్నారు. యూపీ టూ యూకే వరకు వైరస్‌ను వ్యాపింపజేసిందని విమర్శిస్తున్నారు. ఇందుకు కారణం.. ఆమె ప్రిన్స్ చార్లెస్‌తో కలిసి ఉన్న ఫొటోలు. ఇటీవల లండన్ వెళ్లిన కనికా ప్రిన్స్ చార్లెస్‌ను కలిసిందంటూ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రిన్స్ చార్లెస్‌ను కలిసిన మాట నిజమే. కానీ, ఆమె వల్లే ఆయనకు కరోనా వచ్చిందనే ప్రచారం మాత్రం నిజం కాదు. అసలు నిజం ఏమిటంటే..వాస్తవానికి ఆ ఫొటోలు ఇప్పటివి కావు. 2015, 2018 సంవత్సరాల్లో ప్రిన్స్ చార్లెస్ నిర్వహించిన ట్రావెల్స్ టు మై ఎలిఫెంట్స్, బ్రిటీష్ ట్రస్ట్ వార్షికోత్సవాల సమయంలో తీసుకున్న ఫొటోలు. ఆ కార్యక్రమాలకు హాజరైన కనికా కపూర్ ప్రిన్స్‌ చార్లెస్‌తో ఫొటోలు తీయించుకుంది. వాటినే కొందరు సోషల్ మీడియాలో పెట్టి.. తాజా చిత్రాలని ప్రచారం చేస్తున్నారు. ఈ నిజం తెలియని చాలామంది కనికా కపూర్ వల్లే చార్లెస్‌ కు కరోనా సోకిందని భావిస్తున్నారు.