Begin typing your search above and press return to search.
'ఆర్.ఆర్.ఆర్' డైరెక్టర్ కే కాదు ప్రొడ్యూసర్ కి కూడా కరోనా...!
By: Tupaki Desk | 7 Aug 2020 4:15 PM GMTదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవ్వరినీ కరోనా వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదొక రూపంలో మహమ్మారి అటాక్ చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ క్రీడా సెలబ్రిటీలు ఈ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినీ ఇండస్ట్రీల్లో కరోనా ప్రభావం చూపిస్తూనే ఉంది. టాలీవుడ్ లో నటుడు నిర్మాత బండ్ల గణేష్ కరోనా బారిన పడి కోలుకున్నాడు. డైరెక్టర్ తేజ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఇక ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు సింగర్ స్మితలకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పాటు కుటుంబ సభ్యులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కూడా కరోనా బారిన పడ్డారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన డీవీవీ దానయ్య ప్రస్తుతం భారీ బడ్జెట్ తో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే 'ఆర్.ఆర్.ఆర్' మూవీ డైరెక్టర్ రాజమౌళి కరోనా పాజిటివ్ అని తేలిన కొన్ని రోజుల్లోనే ఆ సినిమా ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యకు కూడా మహమ్మారి సోకడం అభిమానులను కలవరపెడుతోంది. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో రాజమౌళి కుటుంబ సభ్యులు అందరూ ఏదొక విధంగా భాగం పంచుకుంటున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు నిర్మాతకి కూడా పాజిటివ్ అని తేలడంతో 'ఆర్.ఆర్.ఆర్' కి వర్క్ చేస్తున్న మెయిన్ టీమ్ అందరికి కరోనా సోకినట్లైంది. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే చిత్రీకరణ స్టార్ట్ చేయాలని భావిస్తున్న తరుణంలో ఇలా 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ లో ఒక్కొక్కరుగా కరోనా బారిన పడటం అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు సైతం జాగ్రత్తగా ఉండాలని.. అన్నీ బాగుంటే షూటింగ్స్ చేసుకోవచ్చని.. కరోనా సోకిన వారు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.