Begin typing your search above and press return to search.
2 డోసులు అయిపోయాయి.. బాలీవుడ్ సెలబ్రిటీకి కరోనా పాజిటివ్
By: Tupaki Desk | 2 Sep 2021 4:12 AM GMTరెండు డోసులు వేయించుకున్నాం.. చెలరేగిపోతాం.. వెనుకా ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు.. ఇలాంటి మాటలన్ని మిగిలిన వాటి విషయంలో ఓకేనేమో కానీ కరోనా విషయంలో కాదు. కరోనాకు చెక్ పెట్టే టీకాలు ఇప్పటివరకు విడుదల కాలేదు. కేవలం.. వైరస్ లోడ్ ను అదుపు చేయటానికి.. ప్రాణాలు పోకుండా కాపాడుకోవటానికి తప్పించి.. మహమ్మారి సోకకుండా వ్యాక్సిన్లు ఆపలేవన్న విషయాన్ని ప్రముఖులు మర్చిపోతుంటారు.
తాజాగా బాలీవుడ్ ప్రముఖురాలు.. మహిళా దర్శకురాలు కమ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖానా కరోనా బారిన పడ్డారు. ఆమె రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయినప్పటికీ ఆమెకు కరోనా కాటు తప్పలేదు. తాను రెండుసార్లు వ్యాక్సిన్లు తీసుకున్నానని.. అయినప్పటికి తాను పాజిటివ్ గా తేలిందని చెప్పారు.
తనకు కరోనా పాజిటివ్ వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. దీంతో.. తనతో సన్నిహితంగా మెలిగిన వారందరిని టెస్టు చేయించుకోవాలని చెప్పినట్లుగా తెలిపారు. ‘నాతో సన్నిహితంగా పని చేసే వారందరిని ముందస్తు జాగ్రత్తలో భాగంగా వెంటనే టెస్టు చేయించుకోమని చెప్పాను. ఒకవేళ పొరపాటున ఎవరికైనా చెప్పటం మర్చిపోయి ఉంటే వెంటనే వారు కూడా పరీక్ష చేయించుకోవాలి. త్వరలోనే నేనీ వైరస్ ను జయిస్తానని ఆశిస్తున్నా’ అంటూ ఇన్ స్టాలో వెల్లడించారు. వ్యాక్సిన్ డోసులు అయిపోయిన నేపథ్యంలో తనకు తిరుగులేదన్న భావనలో ఉన్న ఫరాకు.. తాజాగా పాజిటివ్ అని తేలటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పక తప్పదు.