Begin typing your search above and press return to search.
కమల్ హాసన్ కి కరోనా పాజిటివ్ .. అభిమానుల కోసం ట్వీట్
By: Tupaki Desk | 22 Nov 2021 10:45 AM GMTకరోనా వైరస్ మహమ్మారి ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇప్పటికీ ఇంకా కరోనా మహమ్మారి, కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల తన సొంత క్లాత్ బ్రాండ్‌కు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమెరికా వెళ్లిన కమల్, తాజాగా తిరిగి భారత్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే లక్షణాలు కనిపించగానే వెంటనే అలర్ట్ అయిన కమల్.. పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. అభిమానులు , పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఎంఎన్ ఎం పార్టీ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే తన ఆరోగ్య పరిస్థితిపై కమల్ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. అమెరికా టూర్ నుంచి తిరిగొచ్చిన తర్వాత కాస్త దగ్గు వచ్చింది. దీనితో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాను. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ రాసుకొచ్చారు.
సోమవారం మధ్యాహ్యం కమల్ హాసన్ తాను హస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని అన్నారు. కొవిడ్ కారణంగా ప్రస్తుతం హాస్పిటల్ లో ఐసొలేషన్ లో ఉన్నట్టు కమల్ హాసన్ ఆ ప్రకటనలో తెలిపారు. కమల్ హాసన్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టగానే, ఆయన త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను అభిమానులంతా వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం. మరిప్పుడు తమిళ బిగ్ బాస్ ను ఎవరు నిర్వహిస్తారనే సందేహాన్ని వ్యక్తం చేశారు.