Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో కరోనా కలకలం.. తాజాగా రాజేంద్రప్రసాద్ కు పాజిటివ్
By: Tupaki Desk | 9 Jan 2022 10:58 AM GMTఈ టాలీవుడ్ కు ఏమైంది.. ఓవైపు కరోనాతో సినిమాలు మూతపడ్డాయి. రిలీజ్ డేట్ ప్రకటించినా వాయిదా వేయాల్సిన దుస్థితి. మరో వైపు మొన్నటివరకూ షూటింగ్ లో పాల్గొన్న నటీనటులు కూడా కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. వరుసగా ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు.
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారినపడగా.. తాజాగా టాలీవుడ్ కామెడీ హీరో, నటుడు రాజేంద్రప్రసాద్ కు కూడా కరోనా సోకింది. ఆయనకు కరోనాగా నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు.
రాజేంద్రప్రసాద్ నిన్నటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించకముందే వరుసగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.
ఇప్పటికే టాలీవుడ్ లో కరోనా బారిన పడిన సినీ ప్రముఖులు చాలా మందియే ఉన్నారు. మంచు లక్ష్మీ, మహేష్ బాబు, మంచు మనోజ్, విశ్వక్ సేన్, థమన్, మీనా ఇలా చాలా మంది ఉన్నారు. కరోనా కారణంగా చాలా సినిమాల షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యాయి. కేసులు పెరిగితే లాక్ డౌన్ తప్పేలా లేదు. ఇక కోలీవుడ్ లోనూ కరోనా కేసులు పెరిగాయి. అక్కడి హీరో విష్ణు విశాల్ సైతం వైరస్ బారినపడ్డారు.