Begin typing your search above and press return to search.

తరుణ్ భాస్కర్ కు కోవిడ్ పాజిటివ్

By:  Tupaki Desk   |   21 Jan 2022 10:31 AM GMT
తరుణ్ భాస్కర్ కు కోవిడ్ పాజిటివ్
X
కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం అన్ని రంగాలలో బలంగానే ఉంది. ఇప్పటికే కోవిడ్ ఎఫెక్ట్ తో చాలా నష్టపోయిన సినీ పరిశ్రమ ఇంకా కష్టాల్లోనే ఉంది. ఈసారి చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. మహేష్- మనోజ్- త్రిష- ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌- మమ్ముట్టి- దుల్కర్- సురేష్ గోపి- కీర్తి సురేష్ .. ఇలా చాలామంది తార‌లు కోవిడ్ భారిన ప‌డ్డారు. ఇప్పుడు మరో సినీ సెలబ్రిటీ కరోనా బారిన పడ్డారు. అతనెవరో కాదు.. దర్శకుడు తరుణ్ భాస్కర్.

తరుణ్ భాస్కర్.. తనకు కోవిడ్ పాజిటివ్ అని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. ``ఫ్రెండ్స్ కోవిడ్ వచ్చారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ మామను అందరూ సీరియస్ గా తీసుకోవాలి`` అని తరుణ్ భాస్కర్ అన్నారు. పెళ్లి చూపులు- ఈ నగరానికి ఏమైంది? చిత్రాలతో ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన మార్క్ వేసిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించాలని ఎదురుచూస్తున్నారు.

పెద్ద హీరోతో సినిమా ఏమైంది?

అనీల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో `ఎఫ్-3` తో బిజీగా ఉన్న విక్ట‌రీ వెంక‌టేష్ యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ చిత్రాన్ని ఇప్పుడే లాంచ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారా లేరా? అన్న‌ది తెలియాల్సి ఉంది. వ‌రుస‌గా విజ‌యాలు ద‌క్కుతోన్న త‌రుణంలో కొత్త ద‌ర్శ‌కుడితో రిస్క్ ఎందుక‌ని వెంకీ వెనుక‌డుగు వేస్తున్నారని... పైగా వెంకీ చేస్తోన్న రీమేక్ చిత్రాల‌న్ని ఇక్క‌డా మంచి స‌క్సెస్ అవుతుండ‌డంతో త‌రుణ్ ప్రాజెక్ట్ డిలే అవుతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈనేప‌థ్యంలో మ‌రోసారి రీమేక్ చిత్రంతోనే ముందుకు రావాల‌ని వెంకీ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. వెంకీ హీరోగా గుర్రపు స్వారీ నేపథ్యంలో సినిమా ఉంటుందని టాక్ వచ్చినా సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. తరుణ్ భాస్కర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తున్నాడు అనే దానిపై సస్పెన్స్ కొన‌సాగుతోంది. ఒకే ఒక జీవితం- ఓ మై క‌డ‌వేలు అనే రెండు చిత్రాల‌కు త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాస్తున్నారు.