Begin typing your search above and press return to search.
లోఫర్ బ్యూటీ ఇంట్లో కరోనా పాజిటివ్..!!
By: Tupaki Desk | 6 Aug 2020 10:10 AM GMTదేశంలో కరోనా వైరస్ రోజురోజుకి వేల సంఖ్యలో వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే లక్షలలో నమోదు అయిన కరోనా బాధితులను కాపాడటానికి వైద్యులు ప్రభుత్వాలు అహర్నిశలు పాటుపడుతున్నాయి. సామాన్యు ప్రజల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తేడా లేకుండా అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక సినిమా రంగంలో ఇప్పటికే పలువురు కరోనా బారిన పడి ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇదివరకే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఫ్యామిలీతో సహా కరోనా బారిన పడి క్వారంటైన్ లో ఉన్నారు. అలాగే నిర్మాత బోనికపూర్ ఫ్యామిలీ కూడా కరోనాను ఎదుర్కొన్నారు. కానీ ఎవరికి పాజిటివ్ రాలేదు.
ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఇంట్లో కరోనా కలకలం రేపింది. హీరోయిన్ దిశాపటాని తండ్రి జగదీష్ పటానికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందట. ఈ విషయాన్ని దిశా కుటుంబ సభ్యులు స్వయంగా వెల్లడించారు. దిశా తండ్రి ఉత్తర్ ప్రదేశ్ పవర్ డిపార్ట్మెంట్ లో ఎస్పిగా విధులు నిర్వహిస్తున్నారు. ఓ కేసు విషయంలో లక్నో నుండి బెరేలి వెళ్లారట. ఆ సమయంలో ఆయనకు కరోనా సోకినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకి కరోనా పాజిటివ్ కుటుంబ సభ్యులు అంతా స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లారు. ఇదిలా ఉండగా దిశాపటాని లోఫర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమా తర్వాత అమ్మడు మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన రాధే సినిమా చేస్తోంది.