Begin typing your search above and press return to search.
నటి ఉంటున్న అపార్ట్ మెంట్ లో కరోనా పాజిటివ్
By: Tupaki Desk | 6 April 2020 3:30 PM GMTకరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఈ పేరు వింటేనే అంతా కూడా భయాందోలనతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కరోనా వైరస్ ఒక ఇంటికి మరో ఇంటికి సంబంధం తెగి పోయేలా చేసింది. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతంకు పూర్తిగా రవాణ వ్యవస్థను రద్దు చేసే పరిస్థితికి తీసుకు వచ్చింది. ఈ సమయంలో ఏదైనా ప్రాంతంలో కరోనా పాజిటివ్ వ్యక్తి ఉన్నట్లుగా నిర్థారణ అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నారు. ఆ ఏరియాకు ఇతర ఏరియాల తో పూర్తిగా సంబంధాలు కట్ చేస్తున్నారు.
తాజాగా బుల్లి తెర స్టార్ అంకితా లోఖండే ఉంటున్న అపార్ట్ మెంట్ లో కరోనా పాజిటివ్ అని ఒక వ్యక్తికి నిర్ధారణ అయ్యింది. అతడు స్పెయిన్ నుండి కరోనాతో ఇండియాకు వచ్చాడు. వచ్చిన సమయంలో అతడికి ఎయిర్ పోర్ట్ లో టెస్టులు నిర్వహించగా నెగటివ్ వచ్చింది. కాని రెండు వారాల తర్వాత అతడు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో అతడిని ఇంటికే పరిమితం చేసి చికిత్స అందించారు. అయినా కూడా అతడి పరిస్థితి అలాగే ఉండటం తో హాస్పిటల్ కు తరలించినట్లుగా అంకితా లోఖండే చెప్పుకొచ్చింది.
ఈ విషయంమై బుల్లి తెర స్టార్ అంకితా లోఖండే మాట్లాడుతూ.. గత 12 రోజులుగా మేము ఉంటున్న అపార్ట్ మెంట్ లోని ఒక విభాగం మొత్తం మూసివేశారు. లోని వ్యక్తులు బయటకు పోకుండా.. బయటి వ్యక్తులు లోనికి రాకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వ్యక్తిని ఇటీవలే హాస్పిటల్ కు వెళ్లాడంటూ అంకితా చెప్పుకొచ్చింది. ఈ సమయంలో తామంతా కూడా తీవ్ర భయాందోళన తో ఉన్నట్లుగా పేర్కొంది.