Begin typing your search above and press return to search.
రేణు దేశాయ్ కు కరోనా.. స్పందించిన నటి
By: Tupaki Desk | 8 Jan 2021 1:37 PM GMTఅక్కడెక్కడో పులి సంచరిస్తోందట అని ఎవరైనా అంటారో లేదో.. 'నేను ఇప్పుడే తోకను చూశాను. అది పులి లెక్కనే ఉంది. ఉండడమేంటీ.. అది పులే' అని కన్ఫాం చేస్తుంటారు చాలా మంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. నిజానిజాలు తెలుసుకోకుండా షేర్ల మీద షేర్లు చేసేస్తుంటారు.
పపన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్‌కు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అయింది. దీంతో.. కలవరపడ్డ కొందరు పవన్ అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు కూడా చేశారు. అటూ ఇటూ తిరిగి ఈ విషయం రేణు దాకా వెెళ్లింది. దీంతో ఆమె స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
"నాకు నిజంగానే కరోనా వచ్చిందని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. నిన్న ఓ ఫంక్షన్‌కు వెళ్తే అందరూ నన్ను అదోలా చూశారు. నాకసలు బాధ్యత లేని మనిషిని అన్నట్లుగా చూపులతో గుచ్చారు. అందుకే ఈ పోస్టు పెడుతున్నా. నాకు కరోనా వస్తే ఆ విషయాన్ని స్వయంగా నేనే వెల్లడిస్తాను, అంతేకాదు.. బాధ్యత గల వ్యక్తిగా ఎటువంటి కార్యక్రమాలకు కూడా హాజరవను" అని తేల్చి చెప్పారు రేణు.
తనకు కరోనా పాజిటివ్ అంటూ తప్పుడు వార్తలను రాసినవారిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది నిజం? ఏది అబద్ధమో తెలుసుకుని రాయాలని అసహనం వ్యక్తంచేశారు. ఇలాంటి పుకార్లను నమ్మకండని అభిమానులకు సూచించారు. కొందరు కేవలం సెలబ్రిటీల మీద తప్పుడు వార్తలు రాస్తూ బతుకుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల పుట్టలు సృష్టించే అకౌంట్లను అస్సలు ఫాలో అవకండని ఫ్యాన్స్ ను కోరారు రేణు దేశాయ్.
కాగా.. తనదైన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్.. ఇప్పుడు 'ఆద్య' అనే పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. ఈ సినిమాతో ఎం.ఆర్ కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. డీఎస్ రజనీకాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.