Begin typing your search above and press return to search.

విశాఖ అభిమానికి క‌రోనా ట్రీట్‌ మెంట్ కోసం చిరు ఆప‌త్కాల సాయం

By:  Tupaki Desk   |   9 May 2021 5:45 AM GMT
విశాఖ అభిమానికి క‌రోనా ట్రీట్‌ మెంట్ కోసం చిరు ఆప‌త్కాల సాయం
X
క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం ప్ర‌జ‌ల జీవితాల్లో క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విల‌యం నుంచి ప్ర‌జ‌ల్ని కాపాడేందుకు మాన‌వ‌తా సాయానికి సెల‌బ్రిటీలు ముందుకొస్తున్నారు. ఆస్ప‌త్రుల ముందు హృద‌య‌విదార‌క దృశ్యాలకు చ‌లించిపోతున్నారు.

ఇప్ప‌టికే టాలీవుడ్ కార్మికుల కోసం క‌ష్ట‌కాలంలో సీసీసీ (క‌రోనా క్రైసిస్ చారిటీ)ని ప్రారంభించి మొద‌టి వేవ్ లో క‌నీస నిత్యావ‌స‌రాల్ని అందించి త‌న సేవాగుణాన్ని చాటుకున్న చిరు.. సీసీసీ మిగులు నిధుల‌తో కార్మికులంద‌రికీ వ్యాక్సినేష‌న్ చేయించే దిశ‌గా అడుగులు వేశారు. ర‌క్త‌దానం.. ప్లాస్మా దానంపైనా విరివిగా ప్ర‌చారం చేస్తున్నారు.

ఇప్పుడు లైవ్ గా క‌రోనా మ‌హ‌మ్మారీతో ఊపిరాడ‌ని ఓ అభిమానిని ఆయ‌న కాపాడారు. కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి త‌న అభిమాని అయిన‌ గాజువాక కోయిలాడ శ్రీనివాసరావు స‌తీమ‌ణికి క‌రోనా సోకింద‌ని తెలుసుకుని వెంట‌నే స్థానిక ఆస్ప‌త్రి బృందాల‌తో మాట్లాడారు. తొలుత ఆమెతో మాట్లాడి ఎంతో మనో ధైర్యాన్ని ఇచ్చారు. ధైర్యం కోల్పోయి కుషించి ఉన్న ఆమె ఎంతో నీరసంగా మాట్లాడుతుంటే మెగాస్టార్ అండ‌గా నిలుస్తామ‌ని అన్నారు. మీ బాధ్యత నేనే తీసుకుంటాను ఆస్ప‌త్రిలో వెంట‌నే చేర‌మ‌ని సూచించారు.

వైజాగ్ - సురక్ష హాస్పిటల్ యాజమాన్యులు శ్రీ .రఘు గారితో మాట్లాడి వారి ఆరోగ్య బాధ్యతలు మీరే జాగ్ర‌త్త‌గా చూసుకోవాలని కోరారు. ఆస్ప‌త్రి యాజ‌మాన్యం వెంటనే అడ్మిట్ చేసుకుని ఆమెకు కావలసిన వైద్య సదుపాయాలు కల్పించింది.

ఇంత పెద్ద మనసు చేసుకుని మెగాస్టార్ ఎంతో సమయం వెచ్చించి ప్ర‌జ‌ల‌కు సాయ‌ప‌డుతున్నారు. అపోలో హాస్పిటల్ లో అవ‌స‌ర‌మైన వారికి బెడ్స్ ఏర్పాటు చేయ‌డం.. సురక్ష హాస్పిటల్ వారితో మాట్లాడి సాయ‌ప‌డ‌డం..విశాఖ రాజ‌కీయ నాయ‌కులు గంటా శ్రీనివాస్ వంటి వారి సాయం కోర‌డం ఇదంతా ఆయ‌న గొప్ప మ‌న‌సుకు నిద‌ర్శ‌న‌మ‌ని అభిమానులు ప్ర‌శంసించారు. అభిమానుల‌కు అన్ని విధాలా అండ‌గా నిలుస్తున్న‌ చిరుకి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటామ‌ని ఈ సంద‌ర్భంగా చిరంజీవి యువ‌త అభిమాన సంఘం ప్ర‌క‌టించింది.