Begin typing your search above and press return to search.

కరీనా ఇంట్లో కరోనా కష్టాలు

By:  Tupaki Desk   |   15 Dec 2021 2:47 AM GMT
కరీనా ఇంట్లో కరోనా కష్టాలు
X
మీకు గుర్తుందా...? కరోనా వచ్చిన మొదట్లో గోదావరి జిల్లాల్లో దాని వ్యాప్తి తీరుపై ప్రచారం ఎలా సాగిందో? ఓ వ్యక్తి మోపెడ్ కు మైక్ తగిలించుకుని.. ''బాబ్బాబు ఇది కరీనా (కపూర్) కాదు.. కరోనా.. వచ్చిందంటే వదలదు. జాగ్రత్తగా ఉండండి''అంటూ ప్రజలను తనదైన శైలి వ్యంగ్యంతో చైతన్యం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇప్పుడదే కరీనా కరోనా కష్టాల్లో చిక్కుకున్నారు. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్ కు సోమవారం కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే, సాధారణంగా వైరస్ సోకి ఉంటే ఇది అప్రధాన్య వార్తే అయ్యేది. కానీ, కరీనా పార్టీలో పాల్గొనడం.. ఆమెకు, మరో 11 మందికి వైరస్ సోకడం వివాదాస్పదమైంది. ఒకేచోట ఎక్కువ కేసులు వచ్చిన నేపథ్యంలో కరీనా నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ను అధికారులు సీల్ చేశారు.

పార్టీ ఇచ్చింది కరణ్ జోహార్బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ కరోనా బారినపడ్డారు. ఇటీవల కరీనా, అమ్రుతా అరోరా ఇద్దరూ కలిసి ఓ పార్టీకి హాజరవడం, ఆ పార్టీలో ఓ వ్యక్తి దగ్గుతో బాధపడుతుండడంతో ఆ ఈవెంట్ సూపర్ స్పెడర్ గా మారినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్నవారిలో కనీసం పదిమందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఈ విషయం బాలీవుడ్, ముంబైలో చర్చనీయాంశం అయింది. ఎందుకంటే.. పార్టీ జరిగింది కూడా దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో.. ఈ విషయం అలా ఉంచితే.. కరీనా నివాసాన్ని ముంబై కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. అక్కడివారికి పరీక్షలు చేస్తున్నారు. కానీ, కాంటాక్ట్ ట్రేసింగ్ లో కరీనా సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. భర్త సైఫ్ అలీఖాన్ ఎక్కడ ఉన్నదీ ఎన్నోసార్లు అడిగితే కాని కరీనా చెప్పలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. కరీనా కు కరోనా సోకినందున ఆమె కాంటాక్టుల్లో ఒకరైన సైఫ్ కు పరీక్ష తప్పనిసరి. కాగా, కరీనా, అమ్రుత ఇద్దరూ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పలు పార్టీల్లో పాల్గొన్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ కరోనా సోకిన నేపథ్యంలో వారి ద్వారా కాంటాక్టుల్లో అనేకమందికి వైరస్ వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో మంగళవారం కరీనా నివాసానికి వెళ్లిన అధికారులు అక్కడ ఆమెకు టెస్టులు చేశారు. ఈ సందర్భంగా కరీనా సహకరించలేదని సమాచారం. ఇక సైఫ్ గురించి గుచ్చిగుచ్చి అడిగినా సమాధానం చెప్పలేదు. వారం నుంచి ఆయన ముంబైలో లేరని తెలిపినట్లు.. అసలు ఎక్కడ ఉన్నది? ఎప్పుడు వస్తాడన్నదీ కరీనా వెల్లడించలేదని తెలిసింది.

చిన్న పార్టీనేనట?
సినిమా వాళ్ల పార్టీలంటేనే ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. అందులోనూ బాలీవుడ్ లో పార్టీలంటే అందులోనూ రాత్రి పార్టీలంటే చెప్పేదేముంది. ఆ హంగామా, ఏర్పాట్లు వేరే లెవల్ లో ఉంటాయి. ఇక కరీనా కపూర్ వంటి పెద్ద స్టార్లు పాల్గొన్న కరణ్ జోహార్ వంటి దర్శక నిర్మాత ఇచ్చిన పార్టీ అంటే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. కానీ, కరీనా ప్రతినిధి మాత్రం చిన్న పార్టీనేనని కొ్ట్టిపారేస్తున్నారు. కరోనా సోకిందని తేలిన తర్వాత కరీనా క్వారంటైన్ కు వెళ్లినట్లు చెప్పారు. కాగా ఈ నెల 8న జరిగిన ఈ పార్టీలో పాల్గొన్న వారిలో కనీసం 12 మందికి కొవిడ్ సోకినట్లు సమాచారం. అంటే పార్టీ వైరస్ సూపర్ స్ప్రెడర్ గా మారిందని తెలుస్తోంది.