Begin typing your search above and press return to search.

థియేటర్లలో కరోనా వాక్సినేషన్.. సాధ్యమేనా..?

By:  Tupaki Desk   |   24 March 2021 6:30 AM GMT
థియేటర్లలో కరోనా వాక్సినేషన్.. సాధ్యమేనా..?
X
కోవిడ్-19 కారణంగా గతేడాది సినీ ఇండస్ట్రీ తీవ్ర స్థాయిలో నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్ళీ అన్ని కార్యకలాపాలు ఎప్పటిలాగే జరుగుతూ మాములు స్థితికి వస్తోంది. సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి.. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతుండటం సినీ ఇండస్ట్రీని మళ్ళీ కలవరపెడుతోంది. ఇప్పటికే కరోనా బాలీవుడ్ మార్కెట్ ఇంకా పుంజుకోలేదు. ఈ కారణం చేత రానా 'అరణ్య' హిందీ వర్షన్ విడుదల వాయిదా వేశారు. ఇక తెలంగాణాలో అన్ని విద్యాసంస్థలు క్లోజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు సైతం బహిరంగ సభలలో 100 మందికి మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని సూచించింది. ఈ నేపథ్యంలో థియేటర్ల నిర్వహణ ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తికరంగా మారింది.

దేశవ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో థియేటర్లలో వాక్సినేషన్ ఇవ్వొచ్చు కదా అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీని ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి అడిగారు. ఫిలిం మేకర్స్ థియేటర్లలో వాక్సినేషన్ అందుబాటులో ఉంచొచ్చు కదా? అనే దానికి సమాధానం చెబుతూ.. "ఎందుకు చేయకూడదు? దీనికి ఎక్కువ ఖర్చు కూడా కాదు. దానికి మేము రెడీగా ఉన్నాం. కానీ, ప్రభుత్వం దీనికి అనుమతిస్తుందని నేను అనుకోను'' అని నాగవంశీ అన్నారు. యువ నిర్మాత తప్పించుకోవడానికి ఇలా తెలివిగా సమాధానం చెప్పారని అనుకున్నా.. థియేటర్లకు వచ్చే ఆడియన్స్ కు టీకాలు వేయడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోవచ్చు.