Begin typing your search above and press return to search.
కరోనాతో పాతాళానికి నాన్ థియేట్రికల్ రైట్స్
By: Tupaki Desk | 4 April 2020 2:30 AM GMTకరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడబోతుంది. సినిమా పరిశ్రమకు ఇప్పటికే కనిపిస్తూనే ఉంది. లాక్ డౌన్ తో షూటింగ్స్ లేక సినీ కార్మికులు కనీసం తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉండగా థియేటర్లు ఓపెన్ లేకపోవడంతో సినిమాలు విడుదల ఆగిపోయాయి. షూటింగ్స్ నిలిచి పోవడంతో నిర్మాతలకు కోట్లల్లో నష్టాలు ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత ఈ పరిస్థితి యదాథధం అవుతుందనుకుంటే పొరపాటే అంటున్నారు విశ్లేషకులు.
రాబోయే కాలంలో సినిమా పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నట్లుగా చెబుతున్నారు. థియేట్రికల్ రైట్స్ ఇంకా నాన్ థియేట్రికల్ రైట్స్ ధరు చాలా తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. ముఖ్యంగా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో తీవ్రంగా ప్రభావం పడుతుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఈమద్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే భారీగా ఆధాయంను వెనుకేసుకుంటున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోలు ఏకంగా నాన్ థియేట్రికల్ రైట్స్ ను పారితోషికంగా తీసుకుని కోట్ల రూపాయలను మూట కట్టుకుంటున్నారు. కాని ఇకపై పరిస్థితి వేరే విధంగా ఉండబోతుంది.
నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు. ఇప్పటికే కొన్ని పెద్ద హీరోల.. భారీ బడ్జెట్ సినిమాల నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తి అయినా.. కొనుగోలు ఒప్పందం పూర్తి అయినా కూడా ఇప్పుడు దాన్ని సవరించడం చేసే అవకాశం ఉందంటున్నారు. నిర్మాతలు ఈ పరిణామాలతో నటీనటులు ఇంకా టెక్నీషియన్స్ కు భారీ ఎత్తున పారితోషికంలో కోతలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 50 నుండి 60 కోట్ల పారితోషికం తీసుకున్న హీరోలు కనీసం 30 నుండి 40 శాతం తగ్గించుకోవాల్సి రావచ్చు అంటూ ఒక సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు నటించబోతున్న వరుస మూడు సినిమాల నాన్ థియేట్రికల్ రైట్స్ ను భారీ మొత్తానికి ఒక థర్డ్ పార్టీ వ్యక్తి కొనుగోలు చేశాడు. నిర్మాతలకు ఇప్పటికే భారీగా అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడట. ఇప్పుడు నిర్మాతలు ఆ మొత్తంను తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు అంటున్నారు. ఇక కొన్ని సినిమాల నిర్మాణం ఆగిపోయే అవకాశం ఉందని.. కొన్ని సినిమాలు ప్రారంభం కాకుండానే అటకెక్కే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఒకటి రెండు సినిమాలు మినహా దాదాపు అన్ని సినిమాల బడ్జెట్ లలో కోత విధిస్తారని టాక్ వినిపిస్తుంది.
కరోనా ఎఫెక్ట్ స్టార్ హీరోలు అయినా మహేష్ బాబు.. ఎన్టీఆర్.. చరణ్.. బన్నీ.. ప్రభాస్ వంటి వారికి పడబోతుందని నిపుణులు చెబుతున్నారు. వీరు షేర్ తీసుకోవడంతో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ ను తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇకపై వారికి భారీ గండి తప్పదన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక నిర్మాతలు ఇప్పటికే పెట్టుబడి పెట్టి ఉన్న వారు నష్టాలు ఊహించుకుని భయాందోళనకు గురి అవుతున్నారట. కరోనా నుండి తేరుకుని మళ్లీ సాదారణ పరిస్థితికి రావడానికి ఇండస్ట్రీకి కనీసం రెండు మూడు సంవత్సరాలు అయినా పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.