Begin typing your search above and press return to search.
కరోనా కష్టాల నుండి ఆ యువ హీరో బయటపడతాడా...?
By: Tupaki Desk | 12 April 2020 5:30 PM GMTనాగ శౌర్య.. ప్రస్తుతం టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న యువ హీరో. 'ఊహలు గుసగుసలాడే' 'కల్యాణ వైభోగమే' 'ఛలో' సినిమాలతో తన కెరీర్లోనే మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి బొక్కబోర్లా పడ్డాడు. అయినా పట్టు విడువకుండా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూ ఈ ఏడాది ప్రారంభంలో 'అశ్వథామ' అనే సినిమాను తనే స్వయంగా రచించి నిర్మించాడు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా మనోడికి ఖర్చు పెట్టిన డబ్బులు మాత్రం తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు 'అశ్వథామ' దెబ్బకి నాగ శౌర్య వరుసపెట్టి సినిమాలు సైన్ చేస్తున్నాడు. సొంత ప్రొడక్షన్ లో సినిమాలు చేసి ఉన్న డబ్బులు పోగొట్టుకునే కంటే, హీరోని బయటకు అమ్మి నాలుగు రాళ్లు వెనకేసుకునే ఆలోచనలో శౌర్య అండ్ ఫ్యామిలీ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శౌర్య ఆల్రేడీ కమిటైన సినిమాలకి డేట్స్ ఎడ్జెస్ట్ చేయడమే కాకుండా, కొత్త సినిమాలకి కూడా సైన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో మహిళా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. దీంతోపాటు మహేష్ కోనేరు నిర్మాణ సారథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తనకు లైఫ్ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇంతక ముందే ఆగిపోయిందనే టాక్ వచ్చిన నేపథ్యంలో నిర్మాతలు ఈ విషయాన్ని ఖండించారు.
అయితే ఇప్పుడు కరోనా రూపంలో నాగ శౌర్యకి పెద్ద చిక్కొచ్చి పడింది. అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో రాబోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా ఇంకా 70 శాతం షూటింగ్ మిగిలి ఉంది. ఇదంతా అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. అయితే ఇప్పటి పరిస్థితుల రీత్యా శౌర్యతో మినిమమ్ 5 నుంచి 6 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తేనే బయటపడగలరనే టాక్ మార్కెట్ లో బాగా స్ప్రెడ్ అయిపోయిందట. దీంతో అమెరికాలో కాకుండా ఈ సినిమా కథను ఇండియాలో షూట్ చేసే విధంగా ఛేంజ్ చేయాల్సిందిగా నిర్మాతల దగ్గర నుంచి అవసరాలపై బాగా ఒత్తిడి పెరుగుతోందట. అయితే ఒకవేళ డైరెక్టర్ కథ మారిస్తే ఈ సినిమాకి సంబంధిచిన కోర్ పాయింట్ జనాలకి కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇలా జరిగితే సినిమా ఫ్లాప్ అయ్యే పరిస్థితి వస్తుంది. అసలే ఫ్లాప్స్ లో ఉన్న శౌర్య దీనికి అస్సలు ఒప్పుకోడు. సో ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఆ దేవుడుకే తెలియాలి. అంతేకాదు మనోడు చేస్తున్న మిగతా ప్రాజెక్ట్స్ కథలు, బడ్జెట్స్ విషయంలో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి భవిష్యత్తులో ఈ యువ హీరో కెరీర్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.