Begin typing your search above and press return to search.
కరోనా దెబ్బకి స్టార్ హీరో హీరోయిన్స్ దిగి వస్తారా..?
By: Tupaki Desk | 10 April 2020 11:30 PM GMTకరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్తంగా మారిపోయింది. కరోనా ప్రభావం ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా ప్రతి రంగం మీద తన ప్రభావాన్ని చూపించింది. కరోనా ప్రభావం ఎక్కువగా పడిన రంగాల్లో సినీరంగం ఒకటి. దీని నుండి బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై వచ్చే ఏడాది చివరి వరకు కొనసాగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. దీని వల్ల నిరుద్యోగిత రేటు కూడా పెరిగే అవకాశాలున్నాయి. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రేపు లాక్ డౌన్ ఎత్తేసినా కూడా ప్రజలందరూ డబ్బు విషయంలో చాలా ఆచితూచి అడుగేసే ఛాన్స్ ఉంది. విచ్చలవిడి తనాన్ని వదిలి పొదుపు వైపు మొగ్గు చూపుతారు. అంతేకాకుండా ఎంటర్ టైన్ మెంట్ కోసం మనీ ఖర్చు చేసే వాళ్ళు ఉండకపోవచ్చు. అంత ఖర్చు చేసి సినిమాలను చూడటానికి మల్టీప్లెక్స్ - థియేటర్ల వైపు చూసే జనం చాలా వరకు తగ్గిపోతారు. ఇలాంటి వారందరు ఇంట్లోనే కూర్చొని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా ఇంటిల్లపాదీ చూసుకోవచ్చే ఆలోచనకి వస్తారు. ఇది సినీ ఇండస్ట్రీ మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపనుంది. ఇప్పటికే మల్టీప్లెక్సలు - థియేటర్లు మూసి వేయడంతో నిర్మాతలు డిస్టిబ్యూటర్స్ - థియేటర్ల ఓనర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. రేపు లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సినిమాలను రిలీజ్ చేసినా చూసే వాళ్ళు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఇక చెప్పక్కర్లేదు. సినీ ఇండస్ట్రీ ఎప్పుడూ చూడని దారుణమైన స్థితికి వెళ్తుంది. ఇలాంటి నేపథ్యంలో చిన్న సినిమాల పరిస్థితి కొంచెం అటుఇటుగా ఉన్నా పెద్ద సినిమాల మీద ఈ ఎఫెక్ట్ బాగా పడే అవకాశాలున్నాయి. వందల కోట్లతో తీసే పాన్ ఇండియా సినిమాల సంగతి ఇక అంతే.
ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెద్ద బడ్జెట్ సినిమాలు నిర్మించాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటి నుండి లిమిటెడ్ బడ్జెట్ చిత్రాలను మాత్రమే తీస్తారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా సినిమా ఇప్పటి నుంచి డైరెక్టర్లు - నిర్మాతలు ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది. వీళ్ళు ఖచ్చితంగా ఖర్చు తగ్గించుకునే మార్గాలని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బడ్జెట్ లో ఎక్కువ భాగం ఉండే స్టార్ హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్లు కూడా బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కరోనా ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ నుండి పోయేదాకా నటీనటుల రెమ్యూనరేషన్ తో పాటు సినిమా ప్రమోషన్లు, ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. ఇలాంటి వాటి నిర్వహణ గురించి కూడా నిర్మాతలు ఆలోచిస్తారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.