Begin typing your search above and press return to search.
మన సినిమాలకు ఓవర్ సీస్ లో పెద్ద దెబ్బ పడనుందా..?
By: Tupaki Desk | 10 April 2020 3:39 PM GMTకరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. మహమ్మారి కరోనా ప్రభావం జనాలపైనే కాక సినిమాలపై కూడా పడిందనే విషయం అందరికి తెలిసిందే. కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీ పై కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. సమ్మర్ వస్తే చాలు కొత్త కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడిపోతుంటాయి. అలాంటిది కరోనా వైరస్ గత మూడు వారాలుగా థియేటర్లను మూసి ఉంచేలా చేసింది. కరోనా కారణంగా క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ తమ విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. మన దేశ సినీ ఇండస్ట్రీ మీద మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల ఇండస్ట్రీల మీద కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. అమెరికాలో ఏఎంసీ లాంటి పెద్ద థియేటర్స్ మరో 12 వారాల పాటు మూసివేయబడతాయని ప్రకటించాయి. కరోనా వల్ల ఏఎంసీ థియేటర్స్ కి భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాల నుండి పుజుకుంటామని ఏఎంసీ యాజమాన్యం ప్రకటించినప్పటికీ పరిస్థితులు చూస్తే ఇవి దివాళా తీసే అవకాశాముందని అమెరికాలోని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఏఎంసీ వాళ్ళు 1000 థియేటర్లు మరియు 11000 స్క్రీన్ లను కలిగి ఉన్నారు. ఇవన్నీ మూసివేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీటితో పాటు అమెరికాలోని అన్ని సినిమా థియేటర్లు తీవ్రంగా నస్టపోయాయని చెప్పవచ్చు. ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కూడా లేవని చెప్తున్నారు. దీని వల్ల మన తెలుగు సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ మీద దెబ్బ పడే ఛాన్సెస్ ఉంటాయి.
అమెరికాలో థియేటర్లు నష్టం చవి చూస్తే మన సినిమా మార్కెట్ పై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. కారణం మన సినిమాలు ఎక్కువగా ఆధారపడేది ఓవర్ సీస్ బిజినెస్ పైనే. ఇక్కడ నిర్మించబడే ప్రతి సినిమా అక్కడ విడుదలై భారీ వసూళ్లను రాబడుతుంటాయి. కొన్ని సినిమాలు ఇక్కడ రెవిన్యూ పరంగా ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ ఓవర్ సీస్ కలెక్షన్స్ వల్ల అంతో ఇంతో బయటపడుతుంటాయి. మన హీరోలు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసుకుంటుంటేనే అర్థం చేసుకోవచ్చు ఓవర్ సీస్ బిజినెస్ మన ఇండస్ట్రీకి ఎంత అవసరమో. ఇదిలాగే కొనసాగి ఓవర్ సీస్ లో థియేటర్లు ఓపెన్ అవకపోతే మన చిత్రాల కలెక్షన్లకు దెబ్బ పడే ఛాన్స్ ఉంది. ఇంకా భారీ బడ్జెట్ సినిమాల రెవిన్యూ దాదాపు వెనక్కి తీసుకొచ్చేది యువర్ సీస్ లోనే. వాటి పరిస్థితి ఇంకా అద్వానంగా తయారవుతుంది. ఒకవేళ త్వరలోనే లాక్ డౌన్ ఎత్తేసి రెండు మూడు నెలల్లో థియేటర్లు ఓపెన్ చేసినా పరిస్థితులు చక్కబడేలా కనిపించడం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఒక కొలిక్కి వచ్చినా అమెరికాలో మాత్రం ఈ సమస్య ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. దీంతో మన తెలుగు చిత్రాలు ఎన్నో ఆశలు పెట్టుకొనే ఓవర్ సీస్ మార్కెట్ పోయినట్లే అని, ఇప్పుడల్లా పుంజుకునే అవకాశమే లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.