Begin typing your search above and press return to search.

పెద్దాయ‌న తిట్టినా విన‌లేదు..క‌రోనా దెబ్బ‌కు దారికొస్తారా?

By:  Tupaki Desk   |   3 May 2020 11:30 PM GMT
పెద్దాయ‌న తిట్టినా విన‌లేదు..క‌రోనా దెబ్బ‌కు దారికొస్తారా?
X
``ఇండ‌స్ట్రీలో హీరో సామ్యం రాజ్య‌మేలుతోంది. వ‌ద్ద‌న్నా నిర్మాత‌లే నెత్తికెక్కించుకుంటున్నారు. భారీ పారితోషికాలు ముట్టజెబుతున్నారు! ఈ ప‌రిస్థితి మారాలి!!`` అంటూ ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ఉన్న‌న్నాళ్లు నెత్తి నోరు కొట్టుకునేవారు. అగ్ర హీరోల పారితోషికాల్ని త‌గ్గించుకుని ఎక్కువ సినిమాల్లో న‌టిస్తే ఇండ‌స్ట్రీకి ఉపాధి పెరుగుతుంద‌ని .. కార్మికుల‌తో పాటు నిర్మాత‌ల‌కు అది శ్రేయ‌ష్క‌ర‌మని ప‌దే ప‌దే నిన‌దించేవారు. కానీ ఎవ‌రైనా వింటేనా?

పెద్దాయ‌న చెప్పినా విన‌ని వాళ్లు సైతం ఇప్పుడు క‌రోనా చెబితే వినాల్సిన ప‌రిస్థితి. కొవిడ్ ముందు దిగ్గ‌జాలే మోక‌రిల్లాల్సిన ప‌రిస్థితి. ఒక్క క‌రోనా ఎన్నిటికో సొల్యూష‌న్ గా మారింది. ముఖ్యంగా సినీప‌రిశ్ర‌మ‌లో అనూహ్య మార్పుల‌కు క‌రోనా శ్రీ‌కారం చుట్టింద‌నే చెప్పాలి. ఇక్క‌డ పాతుకుపోయిన దారుణ ప‌రిణామాన్ని మార్చేందుకు కొవిడ్ 19 కృషి మ‌రువలేనిదని విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుత స‌న్నివేశంలో ఇండ‌స్ట్రీ తీవ్రంగా న‌ష్ట‌పోయింది. నిర్మాత‌లు ఆల్మోస్ట్ మున‌క‌లు వేసారు. ఇలాంటి వేళ‌ ఇక‌పై హీరోలు భారీ పారితోషికాలు డిమాండ్ చేసేందుకు ఆస్కారం లేనే లేదు. ఇప్ప‌టికే సెట్స్ పై ఉన్న భారీ చిత్రాల‌కు సైతం అగ్ర హీరోలు పారితోషికాలు భారీగా త‌గ్గించుకుంటేనే రిలీజ్ చేయ‌గలిగే ప‌రిస్థితి ఉంటుంద‌ని చెబుతున్నారు. పాన్ ఇండియా ఆర్.ఆర్.ఆర్ స‌హా చాలా బ‌డా చిత్రాల‌కు ఇదే స‌న్నివేశం ఉంది. ఇప్ప‌టికే దాన‌య్య స‌హా ప‌లువురు అగ్ర నిర్మాత‌లు భారీ బ‌డ్జెట్ల కోత‌పైనా.. హీరోల పారితోషికాల త‌గ్గింపుపైనా ఆలోచిస్తున్నారు. దీనిపై అగ్ర నిర్మాత‌ల్లోనూ రివ్యూలు సాగుతున్నాయి. రిలీజ్ సినిమాల్ని కొనేదెవ‌రు? అడ్వాన్సులు ఇచ్చిన వాళ్లు బేరం మాట్లాడినంతా చెల్లించే సీనుందా లేదా? అన్న‌ది విశ్లేషించారు. ఇక ఫైనాన్సులు తెస్తే అప్పులు చెల్లించ‌డ‌మెలా? అన్న‌దానిపైనా ఆందోళ‌న నెల‌కొంది.

ఇకపై హీరోలకు.. గొంతెమ్మ కోర్కోలు కోరే ఆర్టిస్టుల‌కు ఇక ఆ స‌దుపాయం ఉండ‌ద‌ని తాజా సీన్ చెబుతోంది. బ‌డ్జెట్ల కోత పెద్ద‌దిగా ఉంటుంది. పైగా థియేట్రిక‌ల్ రిలీజ్ చేయాలా వ‌ద్దా? డిజిట‌ల్ వేదిక‌ల్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఒక‌ట్రెండేళ్ల పాటు సినిమాలు తీయాలా? అన్న‌ది కూడా ఆలోచిస్తున్నారు మెజారిటీ నిర్మాత‌లు. కొవిడ్ 19 వ్యాక్సిన్ వ‌చ్చినా ఇంకా భ‌యంతోనే జ‌నం థియేట‌ర్ల‌కు రాక‌పోతే ప‌రిస్థితి ఏమిటో ఊహిస్తున్నారు. ఇక‌పోతే ఇన్నాళ్లు దాస‌రి లాంటి వాళ్లు ఎంత చెప్పినా విన‌ని నిర్మాత‌లు ఇప్పుడు క‌రోనా వ‌ల్ల ప‌రిస్థితిని అర్థం చేసుకుని అన‌వ‌స‌ర ఆర్భాటాల‌కు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ట‌. కార‌వ్యానులు .. స్టార్ల అసిస్టెంట్ల‌కు .. పార్టీల‌కు ఖ‌ర్చు చేసేది త‌గ్గుతుంద‌నే భావిస్తున్నారు. హీరోల విదేశీ ప‌ర్య‌ట‌న‌లు పార్టీల‌కు టిక్కెట్లు బుక్ చేసే క‌ల్చ‌ర్ ఇక‌పై ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంచనా వేస్తున్నారు. దీపం ఉండ‌గానే స‌ర్ధేస్తాం అనే ధోర‌ణిని ఇక‌పై హీరోలు స‌హా స్టార్లు వ‌దిలించుకోక‌పోతే ప‌రిశ్ర‌మ మ‌నుగడ చాలా క‌ష్టంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

టాలీవుడ్ తాజా స‌న్నివేశంపై రివ్యూలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర‌ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఇప్ప‌టికే నిర్మాత‌ల‌తో భేటీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. మే 5న హైద‌రాబాద్ నిర్మాత‌ల మండ‌లి హాల్ లో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. షూటింగులు స‌హా థియేట‌ర్ల విష‌య‌మై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. తాజా ప‌రిస్థితిని అధ్య‌య‌నం చేయనున్న‌రు. ఇక టీవీ ప్రోగ్రామ్స్ షూటింగుల‌కు లైన్ క్లియ‌ర్ చేసే విష‌యంపైనా చ‌ర్చ సాగిస్తున్నారు త‌ల‌సాని. తెలుగు సినిమా భ‌విత‌వ్యంపైనా ఏం నిర్ణ‌యిస్తారు? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. జ‌స్ట్ వెయిట్.. కొన్నిటికి కాల‌మే స‌మాధాన‌మివ్వాల్సి ఉంటుంది.