Begin typing your search above and press return to search.

క‌రోనా ఎఫెక్ట్.. వీళ్లంతా క‌కావిక‌ల‌మేనా?

By:  Tupaki Desk   |   14 March 2020 5:30 PM GMT
క‌రోనా ఎఫెక్ట్.. వీళ్లంతా క‌కావిక‌ల‌మేనా?
X
క‌రోనా క‌ల్లోలం గురించి స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికిప్పుడు థియేట‌ర్ల‌ను బంద్ చేస్తే ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతోంది? అన్న విశ్లేష‌ణ సాగుతోంది. క‌నీసం పది రోజుల పాటు బంద్ ని పాటిస్తే ఇమ్మీడియ‌ట్ గా వాయిదాలు వేయాల్సిన సినిమాల లిస్టేమిటి? అంటే చాలానే ఉన్నాయి. అస‌లు థియేట‌ర్ల బంద్ చేసినా చేయ‌క‌పోయినా క‌రోనా దెబ్బ‌కు జ‌నం అటువైపు చూసే ప‌రిస్థితి లేదు. ఆ క్ర‌మంలోనే కంగారులో ఉన్న డ‌జ‌ను సినిమాల జాబితా ఇలా ఉంది.

మార్చి 20న ఐదు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండ‌గా.. వాటిలోంచి నానీ- సుధీర్ ల `వీ` అధికారికంగా వాయిదా ప‌డింది. శక్తి(డబ్బింగ్) - లవ్ పాజిటివ్- 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? -ఒరేయ్ బుజ్జిగా.. చిత్రాల్ని మార్చి 25న రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే వీటిలో ఎన్ని రిలీజ‌వుతున్నాయి? అన్న‌దానికి క్లారిటీ రాలేదింకా. ఆ త‌ర్వాత శుక్ర‌వారం స‌న్నివేశం ఎలా ఉంటుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. క‌రోనా విస్త్ర‌తి పెరిగితే ఆ మేర‌కు మ‌రింత‌గా ఆందోళ‌న పెరుగుతుందే కానీ త‌గ్గ‌ద‌న్న అంచ‌నా వేస్తున్నారు.

ఏప్రిల్ 2న ఉప్పెన- నిశ్శబ్ధం- అరణ్య చిత్రాలు రిలీజ్ కి రానున్నాయి. మ‌రి వీటిపై కరోనా ప్ర‌భావం ఎంత‌వ‌ర‌కూ ఉంటుంది? థియేట‌ర్ల‌పై ప్ర‌భుత్వాల నిర్ణ‌యం ఏమిటి? అన్న‌ది తేలితే కానీ క్లారిటీ రాదు. బాండ్ 007 సిరీస్ సినిమా `నో టైమ్ టు డై` (ఇంగ్లీష్ డబ్) ఏప్రిల్ 8న రిలీజ్ కావాల్సి ఉండ‌గా క‌రోనా భ‌యం ఇప్ప‌టికే చుట్టు ముట్టేసింది. ఏప్రిల్ 9న రామ్ హీరోగా న‌టిస్తున్న `రెడ్` .. ఏప్రిల్ 10న ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న తెలుగు-త‌మిళ్ ద్విబాషా చిత్రం మాస్ట‌ర్ రిలీజ్ కానున్నాయి. ఏప్రిల్ 10న క‌పిల్ దేవ్ బ‌యోపిక్ (ర‌ణ‌వీర్ సింగ్) 83 రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఏప్రిల్ 17న ఉమా మహేశ్వర ఉగ్రా రూపస్య చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. అటుపై ఏప్రిల్ 24న శ‌ర్వానంద్ న‌టిస్తున్న శ్రీ‌కారం రిలీజ‌వుతుంద‌ని తేదీ వెల్ల‌డైంది. ఏప్రిల్ 30న అల్లుడు అదుర్స్ మే1న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మే 8న ర‌వితేజ క్రాక్ రిలీజ్ కి ముహూర్తం నిర్ణ‌యించారు. మార్చి - ఏప్రిల్ ఆద్యంతం క‌రోనా ఫియ‌ర్ త‌ప్పేట్టు లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ క‌రోనాకు మందు క‌నిపెట్ట‌లేదు. అందువ‌ల్ల ఈ వైరస్ ప్ర‌భావం ఇంకా ఎన్నాళ్లు ఉంటుందో కూడా క్లారిటీ మిస్స‌య్యింది. దాంతో పాటే వినోద ప‌రిశ్ర‌మ టెన్ష‌న్ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇక‌ ఈ సీజ‌న్ లో రిలీజ‌వుతున్న పెద్ద సినిమాల ప‌రిస్థితి ఏమిటి? అన్న‌ది విశ్లేషించాల్సి ఉంది. ఇప్ప‌టికే థియేట‌ర్ల బంద్ కి స‌న్నాహాలు చేస్తున్న నేప‌థ్యంలో ఇందులో ఎన్ని సినిమాల రిలీజ్ తేదీలు మార‌తాయి? అన్న‌ది చూడాల్సి ఉంది. ఇప్ప‌టికి అయితే రిలీజ్ టెన్ష‌న్ అంద‌రినీ వేడెక్కించేస్తోంది. రిలీజ్ తేదీల‌తో ప్ర‌క‌ట‌న‌లు వేయాల‌న్నా ఆలోచించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌ట‌.