Begin typing your search above and press return to search.
#కరోనా: నితిన్ ది బెస్ట్..సాటి హీరోల్లో చలనమేదీ?
By: Tupaki Desk | 24 March 2020 3:50 AM GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజగలాడిస్తోంది. జనజీవనం స్థంభించపోవడమే కాదు.. ఆర్థిక వ్యవస్థలు దారుణంగా కుదేలవుతున్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలు అతలాకుతలం అయ్యాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోవడంతో నిర్మాతలు.. షూటింగ్ లు నిలిపివేయడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారి కూలీపై ఆధారపడే వేలాది మంది కార్మికులు ఇటీవల రోడ్డున పడ్డారు. శ్రమనే నమ్ముకునే పేద సినీ కార్మికుల జీవితాల్లో కరోనా పెను శాపమైంది. ఇప్పటికే దాదాపు వారం రోజులుగా షూటింగ్ లు లేక ఇంటికే పరిమితమై. సరుకులు కొనుక్కోవడానికి డబ్బలు లేక విలవిలలాడుతున్నారు. వారిని గుర్తించి సహాయం చేసేందుకు ఏ పెద్ద హీరో ముందుకు రాలేదు ఇంతవరకూ. ఏ బడా నిర్మాత కనికరించడం లేదు.. ఏ స్టార్ డైరెక్టర్ పట్టించుకోలేదు. దీంతో పేద సినీ కార్మికులంతా తమ జీవితంలో రేపటి గురించి ఆందోళన నెలకొంది.
అయితే ఆదివారం హీరో రాజశేఖర్ స్పందించి పేద కళాకారులకు తమ వంతు సాయం చేస్తానని.. సరుకులు అందిస్తామని ప్రకటించారు. ఇది చూసి కూడా మరెవ్వరూ ముందుకు రాకపోవడంపై విమర్శలొచ్చాయి. తాజాగా హీరో నితిన్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రకృతి విపత్తులు సహా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించే నితిన్ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి... ఏపీ ప్రభుత్వానికి చెరో 10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. కరోనా కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. మార్చి 31వ తేదీ వరకు ప్రకటించిన లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలనీ.. అందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండి.. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో పాలు పంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నితిన్ ఇలా ఇరు ప్రభుత్వాలకు విరాళం ప్రకటించడం పట్ల ప్రశంసలు లభిస్తున్నా..సినీ కార్మికులు.. పేద కళాకారుల గురించి కూడా ఆలోచిస్తే బాగుండేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
మరి నితిన్ లాంటి యంగ్ హీరో స్పందించారు. పెద్ద హీరోలు ఎవరూ స్పందించరా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో సినిమాకి ఇరవై.. ముప్పై కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోలు ఇంత జరుగుతున్నా తన కార్మికుల కోసం.. రాష్ట్ర ప్రజల కోసం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.