Begin typing your search above and press return to search.
కరోనా వచ్చి ఆ హీరోకి కెరీర్ లేకుండా చేసిందా..?
By: Tupaki Desk | 10 April 2020 3:00 AM GMTదేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ చిత్ర పరిశ్రమపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిన్న సినిమాలు ఈ లాక్ డౌన్ కారణంగా చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాయి. కరోనా కారణంగా ఈ సినిమాలు ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతోపాటు లాక్ డౌన్ ఇంకొన్ని రోజులు పొడిగిస్తారన్న వార్తలు రావడంతో చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజయ్యేలా కనిపించడం లేదు. దీంతో చేసేదేమీ లేక వచ్చిందే లాభం అనుకోని కొంతమంది నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో తమ సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని వలన ఒక యువ హీరో కెరీర్ ఇప్పుడు పెద్ద సందిగ్ధంలో పడింది.
వివరాల్లోకి వెళ్తే షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన ఒక యంగ్ హీరో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. మొదటి సినిమానే సూపర్ హిట్ అవడంతో మన వాడు కొన్ని రోజులపాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఫస్ట్ సినిమా ఇచ్చిన హిట్ తో వరుస పెట్టి అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. స్టోరీ - పాత్రల గురించి ఆలోచించకుండా ఎడాపెడా సినిమాలు చేసేసాడు. వాటిలో ఒకటి రెండు హిట్ అవ్వగా మిగతావన్నీ ఘోర పరాజయాన్ని చవి చూశాయి. వరుస అపజయాలతో డీలా పడ్డాడు మన యువ హీరో. దీంతో నెక్స్ట్ సినిమాతో అయినా సక్సెస్ అందుకోవాలని ఎంతో కష్టపడి రీసెంటుగా ఒక సినిమాను సమ్మర్ లో విడుదలకు సిద్ధం చేశాడు. ఈ సినిమాకి హిట్ డైరెక్టర్ నే ఎంచుకున్నాడు. ఈ సినిమాకు ఆ యంగ్ హీరో రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. సినిమా రిజల్ట్ ని బట్టి తప్పకుండా మంచి ఎమౌంట్ ఇస్తామని నిర్మాతలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట. కానీ ఇన్ని చేసినా ఏమి లాభం. 'తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది' అన్న సామెత మాదిరి ఈయనకు కరోనా రూపంలో పెద్ద దెబ్బ వచ్చి పడింది పాపం.
ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ కాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడం లేదని.. డైరెక్టుగా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో డిజిటల్ రిలీజ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిపడ్డాయి. ఈ వార్తలకు కంగారు పడిన ఆ సినిమా ప్రొడ్యూసర్స్ ఈ విషయాన్ని ఖండించారు. కానీ వాళ్ళు కూడా ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తామని గానీ.. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయడం లేదని గానీ.. ఏదీ క్లారిటీగా చెప్పలేదు. జస్ట్ రూమర్స్ నమ్మొద్దని.. త్వరలోనే అప్డేట్ ఇస్తామని మాత్రమే చెప్పారు. వాస్తవానికి ఈ హీరో కెరీర్ స్టార్టింగులో మంచి డిమాండ్ ఉండేది. కానీ అతని ఆటిట్యూడ్ కి లేజీ నెస్ తోడై స్క్రిప్ట్ సెలెక్టన్ సరిగా లేకపోవడం.. మొదలైన విషయాల కారణంగా ఈ సిచ్యుయేషన్ కి వచ్చేసాడని ఫిల్మ్ నగర్ లో టాక్. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి రాకపోతే ఈ సినిమాతో మళ్ళీ పుంజుకోవాలనుకున్న మనవాడి ఆశలు నిరాశగానే మిగిలిపోనుంది. దీంతో మన హీరోకి ఎంత కష్టమొచ్చి పడిందిరా.. ఆ మహమ్మారి కరోనా వచ్చి మనవాడి కెరీర్ ప్రశ్నర్థకంగా మార్చిందంటూ శ్రేయోభిలాషులు బాధ పడుతున్నారట.