Begin typing your search above and press return to search.
అవి కూడా తీసేస్తే 'యన్.టి.ఆర్' లో ఏముంటుంది?
By: Tupaki Desk | 15 Nov 2018 12:27 AM ISTనందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ తీస్తున్న ‘యన్.టి.ఆర్’ సినిమాలో ఏమాత్రం వాస్తవాలు చూపిస్తారనే విషయంలో ఆల్రెడీ అనేకానేక సందేహాలున్నాయి. ఎందుకంటే ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న బాలకృష్ణ. అతను చంద్రబాబుకు వియ్యంకుడు. ఐతే ఎన్టీఆర్ జీవితంలో బాధాకరమైన విషయాలు.. డ్రామా అంతా.. చంద్రబాబు వెన్నుపోటు.. ఆ తర్వాతి పరిణామాల్లోనే ఉన్నాయి. వాటిని సినిమాలో చూపించే అవకాశాల్లేవు. రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగా సినీ రంగంలో ఎన్టీఆర్ ఎదుగుదల గురించి అందరికీ తెలుసు. ఆయన పెద్దగా కష్టాలేమీ ఎదుర్కోలేదు. అనతి కాలంలో అగ్ర హీరోగా ఎదిగారు. ఎదురు లేకుండా సాగిపోయారు. తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం.. రికార్డు కాలంలో ముఖ్యమంత్రి కావడం.. ఇదంతా అందరికీ తెలిసిందే.
నాదెండ్ల భాస్కర రావు వెన్నుపోటు.. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి కావడం కూడా చిన్న విషయమే. కాబట్టి ఈ సినిమా జనాల్లో ఏమాత్రం ఆసక్తి రేకెత్తిస్తుందో అన్న సందేహాలున్నాయి. కాస్తో కూస్తో ఈ చిత్రంలో ఆసక్తి రేకెత్తించే విషయం.. రాజకీయారంగేట్రానికి ముందు తర్వాత ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసిన పోరాటమే. ఎన్టీఆర్ చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీనే రాజకీయ శత్రువుగా భావించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ను స్థాపించారు. కాంగ్రెసేతర పార్టీలన్నీంటిని ఒకే తాటి పైకి తెచ్చారు. ఆ పార్టీ పై అలుపెరగని పోరాటం చేశారు. ఐతే ఇప్పుడు ఈ పోరాటాన్ని సినిమాలో ఉన్నదున్నట్లు చూపిస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టే సమయానికి.. ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ తో తెలుగు దేశం పార్టీ పొత్తు కుదుర్చుకోవడం ఈ సినిమాపై ప్రభావం చూపించడం ఖాయం. సినిమా లో కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తే.. తెలుగు దేశం పార్టీకి ఇబ్బందిగా తప్పదు. పొత్తు ధర్మం తప్పినట్లవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తీసిన సన్నివేశాలకు కోత పెడతారని.. మారుస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కుక్క మూతి పిందెలు అనే పాపులర్ ఎన్టీఆర్ డైలాగ్ ను కూడా సినిమా నుంచి తీసేస్తున్నారని అంటున్నారు. నిజంగా ఈ రకమైన మార్పులు చేస్తుంటే ఇక ‘యన్.టి.ఆర్’లో ఏమాత్రం పస ఉంటుంది.. జనాలకు అది ఎలా కిక్కిస్తుందన్నది సందేహం.