Begin typing your search above and press return to search.

కాస్ట్యూమ్స్ క్రెడిట్ మొత్తం కొట్టేసింది!

By:  Tupaki Desk   |   24 Sep 2019 6:30 AM GMT
కాస్ట్యూమ్స్ క్రెడిట్ మొత్తం కొట్టేసింది!
X
ఒకరు కష్టపడి పని చేయడం.. క్రెడిట్ మరొకరు కొట్టేయడం సహజంగా అన్ని చోట్ల జరిగేదే. పాలిటిక్స్ నుంచి ఐటీ ఇండస్ట్రీ వరకూ అది సర్వసాధారణం. ఇది సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంది. పాపం ఇలా తెరవెనక ఉండి రాసే రైటర్లకు పేరు కూడా ఘోరంగా పెట్టారు.. ఘోస్ట్ రైటర్ అంట.. తెలుగులో అనువాదం.. దెయ్యం రచయిత! అదేదో అజ్ఞాత రచయిత.. అదృశ్య రచయిత అని గౌరవంగా పేరు పెడితే సరిపోతుంది కదా. అంటే అలా కూడా అవమానమే. వారి టాలెంట్ ను వాడుకుని పేరు కొట్టేసేవాడు మాత్రం ఘోస్టు కాదు.. కష్టపడి పని చేసేవాడు ఘోస్టు. ఇదెక్కడి విడ్డూరం?

సరే.. ఇలాంటి అన్యాయాలు అన్ని డిపార్ట్ మెంట్లలో ఉంటాయి. కాస్ట్యూమ్స్ లో కూడా ఇది ఉందట. ఇక మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తే.. అదో భారీ బడ్జెట్ సినిమా. పీరియడ్ ఫిలిం కావడం తో కాస్ట్యూమ్స్ కు ప్రాధాన్యత ఎక్కువ. అయితే ఆ సినిమాకు అధికారికంగా కాస్ట్యూమ్స్ డిజైనర్ ఎవరంటే స్టార్ హీరో పుత్రికారత్నం. కానీ నిజ్జం..గా సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన వారు మాత్రం ఓ ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్.. మన తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయం లేదు. ఆమె పేరు కూడా విని ఉండరు. అయితే ఇప్పుడు ఆమె చేసిన వర్క్ ను ఈ స్టార్ డాటర్ తన ఖాతాలో వేసుకుంది. బయట జనాలకు ఒరిజినల్ కాస్ట్యూమ్ డిజైనర్ పేరు తెలియకపోయినా.. ఇండస్ట్రీలో విషయం తెలిసిపోయింది. అయితే ఎవరూ దీనికి వ్యతిరేకంగా మాట్లాడరు.. పెద్ద స్టార్ హీరో సినిమా కదా!

అయినా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. పేరు కావాలంటే కష్టపడాలి.. కొట్టేయకూడదు అనే చిన్న లాజిక్ మర్చిపోవడం. బయట ఈ కాస్ట్యూమ్స్ డిజైన్ సంగతి తెలియని వారికి ఆమె గొప్ప అనిపించవచ్చేమో కానీ అసలు విషయం తెలిసినవారికి ఆమె చులకన అవుతుంది కదా!