Begin typing your search above and press return to search.

బహుబలికి ఏనుగు.. దేవసేనకు పక్షులు

By:  Tupaki Desk   |   4 May 2017 6:39 AM GMT
బహుబలికి ఏనుగు.. దేవసేనకు పక్షులు
X
బాహుబలి సినిమా ఘనవిజయంలో రాజమౌళి ప్రభాస్ అనుష్క లాంటివారి పనితన ప్రతిభ ఎంత చెప్పుకొన్నా సరిపోదు లెండి. సినిమా జానపద చిత్రం పైగా రాజులు రాణులు కథ. బాహుబలి చిత్ర విజయంలో వారి దుస్తులు వారి వాడిన ఆభరణాలు పాత్ర కూడా చెప్పుకోతగ్గదే. ఎందుకంటే వాళ్ళకు రాజసం ఉట్టిపడే నడక హుందాగా కనిపించే తీరు తీసుకువచ్చింది వారు ధరించే దుస్తులు నగలు వలన అనికూడా మనం చెప్పవచ్చు.

ఈ సినిమాలో దేవసేన.. రాజమాత.. బాహుబలి.. భళ్ళాలదేవుడు.. పాత్ర తగినట్టు చాలా నగలు ధరించారు. వీరి కోసం షుమారుగా 1500 పైగా నగలు ఒక ఏడాదిన్నర పాటు డిజైన్ చేశారు. కేవలం దేవసేన పాత్ర కోసం తలకు పెట్టుకొనే పాపిటబిళ్ల నుంచి కాలి మెట్టెల వరకు నాలుగు సెట్‌ లను డిజైన్ చేశారు. మీరు చూసినట్లయితే విల్లు పట్టుకొన్నప్పుడు ఎరుపు చీరలో.. సింహాసనం పై కూర్చున్నప్పుడు నీలం చీరలో.. దానికి సరిపడే ఆభరణలుతో ముత్యాలు రాళ్ళు కుందన్లతో తయారుచేసిన వెండి వాటిపై బంగారపుపూత పూసిన వాటిని వాడారు. రమ్యకృష్ణ పాత్ర కోసం రాజమాతకు సరితూగే నగలు చివి దిద్దులూ - ముక్క పుడక - చేతి కడియాలు - గాజులూ పచోలీ తరహాలో డిజైన్ చేశారు. ప్రభాస్‌ చేసిన పాత్రలు శివుడు - మహేంద్ర బాహుబలి - అమరేంద్ర బాహుబలి ఇలా ప్రతీ పాత్ర కోసం వాటి పాత్రకి అనుగుణంగా తయారుచేశారు.

భళ్లాలదేవ క్రూరత్వం కనిపించేలా కట్టప్ప బానిస బతుకు చెప్పేలా అడివి లుక్ ఉండేలా డిజైన్లు చేశారు బాహుబలి ఆర్ట్ టీమ్. సినిమాలో నగలు మొత్తం పూలు పక్షులు ఏనుగులు సింహాలను కలిగియుంటాయి. ఆడవాళ్ళకి పూలు పక్షులు ఉన్న డిజైన్లు.. మగపాత్రలుకు ఏనుగులు సింహాలు వాడారు. అంటే సినిమా కథ చెప్పే క్రమం లో వారి దుస్తులు పాత్ర ఎంత ఉన్నది అనేది మీరు అర్ధంచేసుకోండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/