Begin typing your search above and press return to search.
మహర్షి ఓన్లీ 55 డేస్
By: Tupaki Desk | 2 March 2019 11:21 AM GMTమార్చ్ వచ్చేసింది. అధికారిక ప్రకటన ప్రకారం మహర్షి ఇంకో 55 రోజుల్లో వచ్చేస్తాడు. ఇదేమంత పెద్ద గడువు కాదు. రోజులు జెట్ స్పీడ్ తో పరిగెత్తుతున్నాయి. సంక్రాంతి సినిమాల సందడి ఇంకా కళ్ళ ముందు కదలాడుతుండగానే ఎఫ్2 అర్ధ శతదినోత్సవం వచ్చేసింది. సో ఇంకా చాలా టైం ఉంది కదా అని తాపీగా ఉండడానికి లేదు. గత కొన్నిరోజులుగా వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ దిల్ రాజు యూనిట్ అధికారికంగా మహర్షి రిలీజ్ ను ఏప్రిల్ 25 అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
దర్శకుడు వంశీ పైడిపల్లి బాలన్స్ టాకీ పార్ట్ తో కుస్తీలు పడుతున్నాడు. ఇంకా రెండు పాటలు షూట్ చేయాల్సి ఉంది. ఫారిన్ వెళ్ళేంత సమయం లేదు కాబట్టి ఇక్కడే కానిచ్చేయాలి. అదలా ఉంచితే ఇప్పటిదాకా ఓ రెండు పోస్టర్లు చిన్న టీజర్ తప్ప మహర్షికి సంబంధించిన ప్రమోషన్ మొదలుపెట్టలేదు. ఎంత ప్రిన్స్ సినిమా అయినా హంగామా చేయనిదే కుదరదు. అందులోనూ భరత్ అనే నేను తర్వాత ఏడాది గ్యాప్ తో వస్తున్న మహేష్ మూవీ కాబట్టి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి
పోస్ట్ ప్రొడక్షన్ ఒకవైపు ఎంత వేగంగా చేస్తున్నా పాటలు షూట్ చేసి ఎడిటింగ్ సరిచూసుకుని సెన్సార్ ఫార్మలిటిస్ కి పంపించి ఆ తర్వాత ప్రీ రిలీజ్ వేడుకతో పాటు లిరికల్ వీడియోస్ మీడియా ఇంటర్వ్యూలు ఇలా చాలా ఒత్తిడి ఉంటుంది. వంశీ పైడిపల్లి తనకిచ్చిన డెడ్ లైన్ ని మీటయ్యే తీరాలి కాబట్టి డే అండ్ నైట్ దీని మీదే వర్క్ చేస్తున్నాడట.
కనీసం రెండు వారాలు చేతిలో ఫ్రీగా ఉంటేనే మహర్షికి కావలసిన హైప్ ని సృష్టించడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు వంశీ పైడిపల్లి ఒక్కడే కాదు టీం మొత్తం రన్ రన్ అంటూ పరుగులు పెట్టాల్సిందే. ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలుపెట్టుకుని ఎప్పుడెప్పుడు మహేష్ ని మహర్షిగా చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. అసలే 25వ సినిమా. హంగామా మాములుగా ఉండదని వేరే చెప్పాలా