Begin typing your search above and press return to search.

వర్మ మాల్కోవా.. వీళ్ళది పాలకోవా

By:  Tupaki Desk   |   27 Jan 2018 9:54 AM GMT
వర్మ మాల్కోవా.. వీళ్ళది పాలకోవా
X
రాంగోపాల్ వర్మ ఏదైనా ఫిలిమ్ ని కానీ.. ఇంకోటి కానీ స్టార్ట్ చేశాడంటే చాలు.. ఓ వివాదానికి ఆరంభం పలికినట్లే. ఇప్పుడు జీఎస్టీ వంతు వచ్చింది. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అంటూ జీఎస్టీకి కొత్త అర్ధం చెప్పి బాగానే ట్రై చేశాడు. ఆన్ లైన్ లో చూసేందుకు 150 రూపాయల రేటు కూడా కట్టి మరీ జీఎస్టీని జనాలకు చూపించేస్తున్నాడు.

ఇందులో పోర్న్ బ్యూటీ మియా మాల్కోవా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వర్మకు ఓ వ్యక్తి పోటీ వచ్చేస్తున్నాడు. సూర్య ఆకొండి అనే వ్యక్తి తను కూడా జీఎస్టీ అనే ఫిలిం తీస్తున్నట్లు ప్రకటించాడు. ఓ పోస్టర్ కూడా ఇచ్చేశాడు. సూర్య తీసే జీఎస్టీ కి అర్ధం జెంట్స్.. సెక్స్ అండ్ ట్రూత్. వర్మ సినిమాలో మియా మాల్కోవా నటిస్తే.. ఇందులో మేల్ పాలకోవా నటించాడట. మేల్ పాలకోవా యొక్క ఫిలాసఫీ చూపిస్తానంటూ ప్రచారం చేసేస్తున్నాడు. త్వరలో టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు చెప్పడం విశేషం.

అంతే కాదు.. వర్మ అయితే 150 రూపాయలు వసూలు చేసినా.. తను మాత్రం ఫ్రీగానే ఈ ఫిలాసఫీ ఫిలిం చూపిస్తాడట. కానీ వర్మలో స్పెషాలిటీ ఏంటంటే.. ఓ ప్రాజెక్టును తీయడం కంటే.. దాన్ని ప్రమోట్ చేయడంలో చూపించే స్పెషాలిటీ. ఆ రేంజ్ లో ట్రై చేయడం అందరి వల్లా కాదు.. ఒకవేళ చేసినా అంతగా ప్రచారం దక్కదు. మరి ఈ మేల్ జీఎస్టీ ఎంతవరకూ ఆకట్టుకుంటుందో.. ఎవరిని టార్గెట్ చేస్తుందో చూడాలి.