Begin typing your search above and press return to search.
కొరియర్ బాయ్ కళ్యాణ్ మూవీ రివ్యూ
By: Tupaki Desk | 17 Sep 2015 6:28 PM GMTచిత్రం- కొరియర్ బాయ్ కళ్యాణ్
నటీనటులు- నితిన్ - యామి గౌతమ్ - అశుతోష్ రాణా - నాజర్ - హర్షవర్ధన్ - సురేఖా వాణి - సప్తగిరి - రాజేష్ - రవిప్రకాష్ తదితరులు
మాటల సహకారం- హర్షవర్ధన్ - కోన వెంకట్
ఛాయాగ్రహణం- సత్య పొన్మార్
సంగీతం- కార్తీక్ - అనూప్ రూబెన్స్
నేపథ్య సంగీతం- సందీప్ చౌతా
నిర్మాతలు- గౌతమ్ మీనన్ - వెంకట్ - రేష్మ
రచన - దర్శకత్వం- ప్రేమ్ సాయి
మూడేళ్ల కిందట మొదలై... వాయిదాల మీద వాయిదాలు పడిన నితిన్ సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గౌతమ్ మీనన్ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడి నిర్మాణంలో ఒకప్పటి సీరియల్ నటుడు ప్రేమ్ సాయి దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ:
డిగ్రీ మధ్యలో వదిలేసిన కళ్యాణ్ (నితిన్) ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. చాలా ప్రయత్నాలు చేసిన అతడికి ఉద్యోగం దొరకదు. ఐతే ఓ బట్టల దుకాణంలో సూపర్ వైజర్ గా పని చేసే కావ్య (యామి గౌతమ్) కోసమని ఫ్రెండు పని చేస్తున్న కంపెనీలో కొరియర్ బాయ్ గా చేరతాడు కళ్యాణ్. ఆమె వెంట తిరుగుతూ ఆమెను మెప్పించే పనిలో ఉండగా.. అనుకోకుండా అతడి చేతికో కొరియర్ వస్తుంది. ఆ కొరియర్ లో ఓ పెద్ద కుంభకోణానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. దీంతో దాన్ని చేజిక్కించుకోవడానికి ఆ కుంభకోణం వెనుకున్న వ్యక్తులు కళ్యాణ్ వెంట పడతారు. ఇంతకీ ఆ కొరియర్లో ఉన్న సమాచారమేంటి? ఆ కుంభకోణమేంటి? ఆ కొరియర్ ను చేరాల్సిన చోటికి చేర్చి కళ్యాణ్ ఈ ముఠా ఆట కట్టించాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
హాలీవుడ్ సినిమాలు గంటన్నరో, గంటా ముప్పావో ఉంటాయి. వాళ్లు ప్రధానంగా కథ మీదే దృష్టిపెడతారు. కానీ మనకు ఫైట్లు - పాటలు - కామెడీ ట్రాకులంటూ అదనపు హంగులు తప్పవు కాబట్టి అవన్నీ కలిపేసరికి నిడివి రెండుంబావు లేదా రెండున్నర గంటలవుతుంటటుంది. ఐతే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఈ హంగులు జోడించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ లాంటి థ్రిల్లర్ సినిమాకు కూడా ఈ అతకని హంగులు జోడించడమే ఇబ్బంది. మంచి కథ ఉన్నా, ఆ కథ చుట్టూ అల్లుకున్న కథనం కూడా బాగున్నా.. కమర్షియల్ యాంగిల్లో ఆలోచించి జత చేసిన లవ్ ట్రాక్, పాటలు ఈ సినిమాకు ప్రతికూలంగా మారాయి.
గంటా 45 నిమిషాల తక్కువ నిడివితో సినిమా తీసిన దర్శకుడు.. తన సినిమాను ‘థ్రిల్లర్’ బాటలో నడిపించిన గంట సమయం వరకు మెప్పించాడు. ఐతే మిగతా సమయంలో వచ్చే రొటీన్ లవ్ ట్రాక్స్, పాటలు ఇబ్బంది పెడతాయి. నిడివి తక్కువే అయినప్పుడు నేరుగా కథలోకి దిగిపోయి ఉంటే.. ఈ అదనపు హంగుల మీద దృష్టి పెట్టకుండా ఉండుంటే ‘కొరియర్ బాయ్ కళ్యాణ్ మంచి థ్రిల్లర్ అయి ఉండేది. దర్శకుడు కథకు కట్టుబడి తీసిన సన్నివేశాలు మాత్రం ఆకట్టుకున్నాయి.
హాలీవుడ్ సినిమా ‘ప్రీమియం రష్’కు దీనికి ఏ సంబంధం లేదని దర్శకుడన్నా.. అతను ఎంచుకున్న ‘స్టెమ్ సెల్’ పాయింట్ ను పక్కనబెడితే.. కథనమంతా ప్రీమియం రష్ తరహాలోనే సాగుతుంది. హీరో దగ్గరున్న కొరియర్ ను డెలివరీ కాకుండా చూడ్డానికి విలన్ గ్యాంగ్ ప్రయత్నించడం అనేది అక్కడా ఇక్కడా కామన్ పాయింట్. స్టెమ్ సెల్స్ నేపథ్యంలో కథ రాసుకోవడం వల్ల ఈ సినిమా మూడేళ్ల ముందు మొదలైనా ఇప్పటికీ కంటెంపరరీగానే అనిపిస్తుంది. ఒక ఊహాజనితమైన పాయింటుతో ఆసక్తికరంగానే కథ రాసుకున్నాడు ప్రేమ్ సాయి. నితిన్ అన్నట్లు ఇది ‘యునీక్’ పాయింటే.
సినిమా ఆరంభం నుంచి మూల కథ చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆసక్తి రేపుతాయి కానీ.. ఐతే హీరో పరిచయ సన్నివేశాలు, లవ్ ట్రాక్ సాదాసీదాగా అనిపిస్తాయి. పైగా పాటలు కథనానికి అడ్డుపడతాయి. ఐతే ఇంటర్వెల్ కు ముందు కథ ట్రాక్ మీదికి వస్తుంది. 45 నిమిషాల నిడివి గల ద్వితీయార్దంలో కథనం రేసీగా ఉండటంతో సమయం బాగానే గడిచిపోతుంది. ఐతే ఇక్కడ కూడా దర్శకుడిని ‘కమర్షియల్’ హంగుల బలహీనత వెంటాడింది. అవసరం లేని కామెడీ సీన్, ఓ పాట కథనానికి అడ్డం పడతాయి. వాటిని పక్కనబెట్టేస్తే ప్రేక్షకులు చివరి అరగంట బాగానే ఎంగేజ్ అవుతారు. క్లైమాక్స్ లో హీరో విలన్ కథ ముగించే సీన్ బాగుంది.
దర్శకుడు హీరోను చాలా మామూలుగా చూపించాడు. అతడితో వీరోచిత విన్యాసాలు చేయించలేదు. క్లైమాక్స్ లో విలన్ల పని పట్టే విషయంలోనూ హీరో సామాన్యుడిలాగే ప్రవర్తిస్తాడు. ఈ విషయంలో తెలుగు సినిమా కమర్షియల్ సూత్రాలకు భిన్నంగా వ్యవహరించిన ప్రేమ్ సాయి.. సినిమా అంతా ఇలాగే తీసే ప్రయత్నం చేస్తే బావుండేది.
నటీనటులు:
నితిన్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. అతడి నటన బాగుంది. ఐతే స్టైలింగ్ విషయంలోనే జాగ్రత్త పడాల్సింది. మధ్య తరగతి కుర్రాడిగా నటిస్తున్నపుడు ఆహార్యం అలాగే ఉండేలా చూసుకోవడం ముఖ్యం. బేసిగ్గా నితిన్ పక్కింటి కుర్రాడిలాగే కనిపిస్తాడు కాబట్టి సర్దుకోవచ్చు కానీ.. హీరోయిన్ మాత్రం మిస్ ఫిట్ అయింది. యామి గౌతమ్ లాంటి మోడర్న్ లుక్ తో కనిపించే హీరోయిన్.. బట్టల షాపులో పని చేసే మామూలు అమ్మాయిగా సూటవ్వలేదు. ఆమె పాత్ర కూడా అంతంతమాత్రంగానే ఉంది. హర్షవర్ధన్, సురేఖావాణి, రాజేష్ బాగా చేశారు. అశుతోష్ రాణా, నాజర్, రవిప్రకాష్ పాత్రలకు తగ్గట్లు నటించారు. సప్తగిరి కామెడీ గురించి చెప్పడానికేమీ లేదు.
సాంకేతికవర్గం:
‘కొరియర్ బాయ్ కళ్యాణ్’లో గాయకుడు కార్తీక్ మూడు పాటలు, అనూప్ రూబెన్స్ ఓ పాట కంపోజ్ చేశారు. ఆ నాలుగు పాటలూ వినడానికి బాగానే ఉన్నాయి. ఓ లవ్ స్టోరీకైతే ఇవి బాగానే కుదిరి ఉండేవి. కానీ ఈ సినిమాకు అడ్డం పడ్డాయి. సందీప్ చౌతా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఓకే. ప్రేమ్ సాయికి కోన వెంకట్, హర్షవర్ధన్ ‘మాట’ సాయం చేశారు. ఐతే సినిమాలో మాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ప్రేమ్ ను కథ విషయంలో అభినందదించాలి. లవ్ ట్రాక్ కథకు అవసరమే లేదంటే.. దాన్ని అతను డీల్ చేసిన తీరు కూడా బాలేదు. దర్శకుడిగా అతడికి పాస్ మార్కులు వేయొచ్చు.
చివరగా:
‘కొరియర్’లోనే విషయమంతా ఉన్నపుడు దానిమీదే దృష్టిపెట్టాల్సింది. కానీ ‘ప్రేమ’లో పడి, డ్యూయెట్లేసుకోవడం వల్ల డెలివరీ కొంచెం లేటైంది.
రేటింగ్- 2.75/5
#Courierboykalyan, #courierboykalyanmovie, #courierboykalyanreview, #Nitincourierboykalyan, #Courierboykalyanrating,#courierboykalyantalk,#Nitin
Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre