Begin typing your search above and press return to search.
హిందూ సెంటిమెంట్ చిక్కుల్లో ఖాన్ లు
By: Tupaki Desk | 16 Jan 2016 8:31 PM GMTబాలీవుడ్ ఖాన్ త్రయానికి వివాదాలు కొత్తేం కాదు కానీ.. ఈ మధ్య మతపరమైన వివాదాల్లో ఎక్కువగా చిక్కుకుంటున్నారు. రీసెంట్ గా హిట్ అండ్ రన్ కేస్ నుంచి బయట పడ్డాడు సల్మాన్ ఖాన్. షారూక్ ఖాన్ కూడా మత అసహనం అంటూ కామెంట్ చేసి చాలామందితో చీవాట్లు వేయించుకున్నాడు.
ఇప్పుడీ ఇద్దరు ఖాన్ లు మరోసారి హిందూ సంబంధిత వివాదంలో పడ్డారు. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఓ ఎపిసోడ్ ప్రసారమైంది. సల్లూభాయ్ హోస్టింగ్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి, బాలీవుడ్ బాద్షా స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. హిందు దేవత ఆలయం సెట్ లో ఈ ఎపిసోడ్ నడిచింది. ఇందులో ఈ ఇద్దరు ఖాన్ లో షూస్ వేసుకుని ఉండడం వివాదానికి దారి తీసింది. దీనిపై హిందూ మహా సభ కోర్టుకెక్కింది. హిందూ సెంటిమెంట్లను అవమానించారని, కాళికా దేవి ఆలయం సెట్ వేసి, కావాలనే ఇలా షూస్ తో కార్యక్రమం నిర్వహించారని ఆరోపించింది.
హిందు మహా సభ తరఫున భరత్ రాజ్ పుత్ వేసిన ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టి, ఈ ఇద్దరు బాలీవుడ్ ఖాన్ లకు నోటీసులు ఇచ్చింది. కాళీ ఆలయంలో కాళ్లకు షూస్ వేసుకున్నారనే కేసులో.. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ లు ఈనెల 18న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ఈ నిర్ణయంతో.. ఈ ఖాన్ లు మరో వివాదాన్ని రాజేసినట్లు అయింది.